NTV Telugu Site icon

JDU: ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కాదు వ్యాపారవేత్త.. జేడీయూకు అవసరం లేదు

Prashanth Kishore

Prashanth Kishore

JDU: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై జేడీయూ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్ అలియాస్ లలన్‌ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యూహకర్తగా మారిన రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో గట్టి పట్టు సాధించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రల్లో భాగంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారని జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ శనివారం ఆరోపించారు. ప్రశాంత్‌ కిషోర్‌ రాజకీయ వ్యూహకర్త కాదని ఆయన ఓ వ్యాపారి అని లలన్‌ సింగ్ విమర్శించారు. పార్టీలో చేరాలని నితీష్ కుమార్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని ప్రశాంత్‌ కిషోర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో లలన్‌ సింగ్ ఈ విధంగా నొక్కి చెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌ కొంతకాలంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇటీవల బిహార్‌ సీఎం నితీష్ కుమార్‌తో ప్రశాంత్‌ కుమార్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. గతంలో జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌.. కొన్నాళ్లుగా నితీష్‌పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, నితీష్ నుంచి తనకు పార్టీలో చేరాలని ఆహ్వానం అందిందని, అయితే తాను తిరస్కరించానని ప్రశాంత్ కిషోర్‌ పేర్కొన్నారు. దీనిపై లలన్‌ సింగ్‌ స్పందిస్తూ.. పీకేకు జేడీయూ నుంచి ఎలాంటి ఆఫర్‌ అందలేదని లలన్‌ సింగ్‌ అన్నారు. “బీహార్‌లో బీజేపీ కుట్రలపై ఆధారపడుతోంది. మొదట ఆర్‌సీపీ సింగ్‌ను ఉపయోగించుకుంది, ఇప్పుడు అది ప్రశాంత్ కిషోర్‌ను ఉపయోగిస్తోంది. ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయ వ్యూహకర్త కాదు.. అతడో వ్యాపారి. గతంలో బీజేపీ కోసం కొంతకాలం పనిచేశాడు. మేం అప్రమత్తంగా ఉన్నాం. భాజపా పాచికలు పారనివ్వబోం” అని లలన్‌ సింగ్‌ అన్నారు.

NIA inspections: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. నిజామాబాద్‌లోనే 22 మందిని..

కొన్ని రోజుల క్రితం తనను ప్రశాంత్ కిషోర్‌ ఢిల్లీలో కలిశారని జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్ చెప్పారు. పార్టీలోకి రావాలంటే నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయనకు తాను స్పష్టం చేశానని అన్నారు. ఆ తర్వాత సీఎం నితీష్ కుమార్‌తో అపాయింట్ మెంట్ కుదిరిందని అయితే ఓ వ్యూహం ప్రకారం అతను దాన్ని తప్పుగా ప్రచారం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తనను ఇంటికి పిలిచినా తాను వెళ్లలేదని పీకే మీడియాతో చెప్పారని, అదంతా అవాస్తవం అన్నారు. ఇటీవల సీఎం నితీష్‌ కుమార్‌తో ప్రశాంత్ కిషోర్‌ భేటీ జరిగింది. అప్పుడు కూడా.. తనని నితీష్ పార్టీలోకి ఆహ్వానించారని, సమావేశానికి కూడా ఆయనే తనను పిలిపించారని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పుకున్నారు. దీనిపై రాజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. లలన్‌ సింగ్ వ్యాఖ్యలతో ప్రశాంత్‌ కిషోర్‌- నితీష్‌ కుమార్‌ల మధ్య స్నేహం చిగురించిందన్న వార్తలు అవాస్తవం అని తేలిపోయారు. లలన్‌ సింగ్‌ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్‌ స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.