ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జై హనుమాన్’. గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నర్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
Also Read : Ilaiyaraaja: ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. కాపీరైట్ వివాదంలో మాస్ట్రోకు ఎదురుదెబ్బ
చారిత్రక నేపథ్యం ఉన్న హంపి క్షేత్రంలో ఫిబ్రవరి 22, 2026న ఈ సినిమాను ఘనంగా ప్రారంభించబోతున్నారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యాస్టింగ్ ఉండబోతోందన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి ఇందులో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఆయన ఈ సినిమాలో విభిన్నమైన గెటప్పులలో కనిపిస్తారని, కథను మలుపు తిప్పే పాత్రలో మెరుస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ పాన్-ఇండియా వండర్‌ను నిర్మిస్తున్నాయి.
