ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్ మరియు కొత్త ఆర్టిస్టుల హవా నడుస్తోంది. న్యూ ఏజ్ యంగ్ మేకర్లు రూపొందిస్తున్న చిత్రాలలో ఎక్కువగా సోషల్ మీడియా వేదికల నుంచి వచ్చిన ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తమ ప్రతిభను చాటుతున్న ఆర్టిస్టులను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో, యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు చేస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు వెండితెరపై జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ప్రసాద్ బెహరా తన నటనా పటిమతో ఇప్పటికే పలు సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘పెద్దోడిగా’ పాత్రలో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో నటించి, తన ఎమోషనల్ సీన్లతో అందరినీ ఏడిపించాడు. ఆ వెంటనే, రీసెంట్‌గా విడుదలైన ‘మిత్ర మండలి’ సినిమాలో మాత్రం తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించాడు. ఇలా ప్రసాద్ బెహరా తన ప్రతీ పాత్రతో ప్రేక్షకులపై ఒక ప్రత్యేక ముద్ర వేస్తున్నాడు. ‘బ్యూటీ’, ‘బచ్చలమల్లి’, ‘విరాజి’ వంటి చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
Also Read: OG OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన OG.. ఎక్కడంటే
యూట్యూబ్‌లో ప్రసాద్ బెహరా నటించిన ‘మా విడాకులు’, ‘పెళ్లివారమండి’ వంటి హిట్ వెబ్ సిరీస్‌లు ఆయనకు పెద్ద ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. యూట్యూబ్‌లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన ప్రసాద్, అదే స్పీడ్‌తో ఇప్పుడు వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. త్వరలో విడుదల కానున్న ‘పాపం ప్రతాప్’, ‘రోమియో జూలియట్’ చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా, మరో మూడు సినిమాల్లో లీడ్ పాత్రల్లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్‌గా ఉన్న ప్రసాద్ బెహరా… ఇప్పుడు వెండితెరపై రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బిజీ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు.