తెలుగులో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన కన్నడ భామ ప్రణీత హీరోయిన్ గా సౌత్ స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2021లో పెళ్లి చేసుకున్న ఈ భామ.. గత ఏడాది ఒక పాపకి కూడా జన్మనించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ట్రై చేస్తుంది.. సోషల్ మీడియాలో అందాలతో మత్తెక్కిస్తుంది.. రోజు రోజుకు అందాల ఆరాబోతలో బౌండరీలు చేరిపేస్తుంది.. ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.. తనపై వస్తున్న ట్రోల్ల్స్ కు చెక్ పెడుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది..
హీరోయిన్ గా ఎంత మోడరన్ గా కనిపించినా.. వ్యక్తిగతంగా మాత్రం ప్రణీత సనాతన ధర్మాన్ని బాగా ఫాలో అవుతుంటుంది. ఈ క్రమంలోనే భీమన అమావాస్య సందర్భంగా తన భర్త పాదలకు పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసింది. ఈ ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భీమన అమావాస్య రోజున ఇలా పూజ చేయడం కర్ణాటకలో సంప్రదాయంగా భావిస్తారు. ఇదే పూజని ప్రణీత గత ఏడాది కూడా నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అప్పటిలో విమర్శలు, ట్రోల్స్ ఎదురుకుంది.
అంతేకాదు.. కొంతమంది ఫెమినిస్టులు ప్రణీత చేసిన పూజని విమర్శించారు. దీని పై డిబేట్ లు కూడా చేశారు. అప్పటిలో ఆ విమర్శలు, ట్రోల్స్ గురించి ప్రణీతని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ‘నేను హీరోయిన్ కాబట్టి, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నానని పూజలు, పునస్కారాలు చేయనని అనుకోవడం వారి తప్పు’ అంటూ సున్నితంగా రియాక్ట్ అయ్యింది. ఇక ఈ ఏడాది మళ్ళీ తన భర్త పాదాలకు పూజ చేసి ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. విమర్శలు, ట్రోల్స్ చేసేవారికి గట్టి పంచ్ ఇచ్చింది. ‘భీమన అమావాస్య సందర్భంగా నేడు పూజ చేశాను. దీని వల్ల గత ఏడాది ట్రోల్స్ అండ్ విమర్శలు చూశాను. ఇది మీకు పురుష ఆధిపత్యంలా ఉండొచ్చు. కానీ నా వరకు ఇది నా సనాతన ధర్మం. ఈ పూజకి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి మరెన్నో పూజలకు అంతటి ప్రాముఖ్యత ఎందుకొచ్చింది అనేదానికి చాలా కథలే ఉన్నాయి..అంటూ ట్రోల్స్ చేస్తున్న వారి నోరు మూయించింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.