Pranay Case: తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందని తండ్రి మారుతీ రావు కూతురి భర్త ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నల్గొండ పరువు హత్య కేసులో ఇన్నాళ్లకు తుది తీర్పు వెల్లడయ్యింది. కేసులో భాగంగా ఉన్న ఏ-2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది కోర్టు.
అలాగే మిగితా నిండుతులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష (జీవితఖైదు) ఎస్సీ – ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం విధించింది. ఐపీసీ 302, 120B ipc, 109, 1989 సెక్షన్ ipc ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించారు. ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న మారుతీ రావు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఆయన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.