ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై ఇన్‌స్టాగ్రామ్‌లో అమృత స్పందించింది. "ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. న్యాయస్థానంలో న్యాయం జరిగింది. పోలీస్ శాఖకు, వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ, సహకరించిన మీడియాకు ధన్యవాదాలు. బాబు ఎదుగుతున్న నేపథ్యం... అతని భవిష్యత్తు, నా మానసిక పరిస్థితి దృష్ట్యా మీడియా ముందుకు రాలేకపోతున్నాను. నా అభ్యర్థనను అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్న." అని అమృత పేర్కొంది.
ప్రణయ్ హత్య కేసులో తీర్పుపై అమృత స్పందించారు. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో '10-03-2025' తేదీని లవ్ సింబల్‌తో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. 'రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్' అని రాసి పోస్ట్ చేసింది.
Justice For Pranay: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన తర్వాత బాధిత కుటుంబం భావోద్వేగంగా స్పందించింది. “జస్టిస్ ఫర్ ప్రణయ్” పేరుతో తాము చాలా కాలంగా పోరాటం చేశామని, ఇన్నాళ్లకు న్యాయం జరిగినట్లు భావిస్తున్నామని వారు తెలిపారు. ప్రణయ్ హత్య తర్వాత కూడా ఇలాంటివి అనేక సంఘటనలు జరిగాయి. ఇలాంటి కులాంతర హత్యలు, కుల దురాంకర హత్యలు చేసేవారికి.. కన్న కూతురు, కన్న కొడుకులను చంపే వారికి ఈ తీర్పు కనువిప్పుగా మారాలని ప్రణయ్…
Pranay Case Judgement: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో చోటుచేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, అమృత…
Final Judgement: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో…
Cyber Crime Voice: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల చట్ట విరుద్ధ కార్యకలాపాలు పెరుగుతూ ప్రజలను మోసం చేసి వారి డబ్బును కాజేయడం చూస్తూనే ఉన్నాం. మీరు లక్కీ డ్రాలో గెలిచారు.., మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి, అద్భుతమైన ఆఫర్ మీ కోసం.. అంటూ నకిలీ కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసు అధికారులు ప్రజలకు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ, మోసాలు తగ్గడం లేదు. ఇందుకోసం సైబర్ మోసాలపై ప్రజల్లో…
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. తోట రామకృష్ణ దర్శకత్వంలో ఎ. యామిని కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ తన ఓటీటీలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత యామిని కృష్ణ మాట్లాడుతూ, ”కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టగానే నిదానంగా థియేటర్లు తెరుకున్నాయి. అదే సమయంలో ఎంతో ధైర్యం చేసి, మా ‘పరిగెత్తు…