మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. “ఎక్స్”లో కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్ ను పంచుకున్నారు. “ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా ?..” అని రాసుకొచ్చారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హిరోహిన్లు బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం కూడా కేటీఆర్ అని ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రకాశ్ రాజ్ ఈ విధంగా స్పందించారు.
READ MORE: Israel: ఇరాన్ చమురు, అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు ఫ్లాన్.. యూఎస్ మీడియాలో కథనాలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అని అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని తెలిపారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదన్నారు. సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారు. నివేందుకు రియాక్టు కాలేదు..మనిషివి కాదా..పశువు వా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు తల్లి లేదా అని మండిపడ్డారు. మూడు అకౌంట్ లు దుబాయ్ నుండి పోస్టులు పెడుతున్నారన్నారు. మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు అని ప్రశ్నించారు. కొంతమంది హీరోయిన్లు తొందర పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అన్నారు.
READ MORE:Pemmasani Chandrasekhar: గుంటూరు నగరాన్ని క్లీన్సిటీగా చేసేందుకు కృషి చేయాలి..
సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హిరోహిన్లు బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం కూడా కేటీఆర్ అన్నారు. ఎంతో మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆదుకున్నాడు అని తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్ అలవాటు చేశాడని మండిపడ్డారు. దసరా పండుగ ముందు.. అడ బిడ్డ ఏడుపు మంచిది కాదన్నారు. ప్రతీ దానికీ ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్.. నామీద ట్రోల్ చేసిన దాని పై ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్ కంటే..హరీష్ రావు బెటర్ అన్నారన్నారు. హరీష్ రావు కనీసం స్పందించారన్నారని తెలిపారు. బామ్మర్ది కంటే.. బావకు సంస్కారం ఉంది. మూడు రోజుల క్రితమే కేటీఆర్.. మాకు సంబంధం లేదు అని ఐనా చెప్పాలి కదా..? అని ప్రశ్నించారు. మార్ఫింగ్ చేయాలని మేము అనుకుంటే.. ఆయన పెళ్ళాం ఫోటో నో.. చెల్లె ఫోటో నో పెట్టీ చేయలేమా..? మేము అని మండిపడ్డారు. కానీ.. మాకు సంస్కారం ఉంది.. అలా చేయమన్నారు.
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking https://t.co/MsqIhDpbXa
— Prakash Raj (@prakashraaj) October 2, 2024