NTV Telugu Site icon

Vemulawada Temple : ఆ ప్రచారంలో నిజం లేదంటున్న ఆలయ పూజారులు

Vmd

Vmd

కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రకాశ్ జవదేకర్ విచ్చేశారు. అయితే.. స్వామి వారి ఆలయంలోకి ప్రకాశ్ జవదేకర్ పాదరక్షలతో వెళ్లారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలోకి ఆయన పాదరక్షలు ధరించి వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి.

Also Read : Nedurumalli Ramkumar Reddy: బ్రష్టుపట్టించాలనే ఇలా చేశారు..’ఆనం’పై నేదురుమల్లి విమర్శల వర్షం

వేములవాడ ఆలయంలో ప్రకాష్ జవదేకర్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. ఆయన పాదరక్షలు ధరించలేదని వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే.. ఆలయ పూజారులు ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రకాశ్ జవదేకర్ పాదరక్షలతో ఆలయంలోకి వచ్చారని ప్రచారం చేయడంలో నిజం లేదన్నారు. వాస్తవానికి ఆయన ఆరోగ్య పరిస్థితులు రీత్యా కాళ్లకు సాక్సులతో వచ్చారని, ఆలయంలోకి ప్రవేశించిన సమయంలో వాటిని కూడా తొలగించారని ఆలయ పూజారులు వివరించారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేందుకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు రాజన్న ఆలయ అర్చకులు.

Also Read : ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

ఇదిలా ఉంటే.. ప్రకాశ్ జవదేకర్ గుడిలోకి బూట్లు వేసుకుని వెళ్లారంటూ, గర్భగుడిలోకి బీజేపీ నేత బూట్లు వేసుకుని వెళ్తారా ఇదేనా దైవ భక్తి అంటూ ఓ వీడియో వైరల్ అయింది.. ఇలా జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ప్రచారం చేస్తున్న వారికి కాలిజోళ్లకు సాక్స్‌కు తేడా తెలియదని విమర్శించారు.ఆయన అనారోగ్యం కారణాల వల్ల సాక్స్‌తో ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టారని ఈ క్రమంలో జారిపడుతుండగా సాక్స్‌కూడా తొలగించారని ఆయన పేర్కొన్నారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న