Prabhas Remuneration For Kalki 2898 AD: దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపిక పదుకొణె కథానాయికగా నటించారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా.. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్‌లు అంచనాలను మరింత పెంచాయి. రిలీజ్‌కి మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో.. అందరూ కల్కి గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి.
కల్కి 2898 ఏడీని రూ.600 కోట్ల బడ్జెట్‌తో తీశారని సమాచారం. ఇందులోనే రెమ్యునరేషన్స్ కూడా ఉంటాయన్న విషయం తెలిసిందే. కల్కి కోసం ప్రభాస్ రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే సినిమా బడ్జెట్‌లో 25 శాతం అన్న మాట. ఈ విషయం తెలిసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. సలార్ హిట్ అవ్వడంతో ప్రభాస్ తన రెమ్యునరేషన్ను బాగా పెంచాడని తెలుస్తోంది.
Also Read: WI vs USA: అమెరికాపై ఘన విజయం.. వెస్టిండీస్ సెమీస్ అవకాశాలు సజీవం!
కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలు చేసిన అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ తలో రూ.18-20 కోట్లు తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ భామ దీపిక పదుకొణె రూ.20 కోట్లకు పైనే ఛార్జ్ చేశారట. ఇక దిశా పటాని రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్‌లో రూ.250 కోట్ల వరకు పారితోషికాలే అట. మిగిలిన రూ.450 కోట్ల బడ్జెట్‌తో మూవీ తీశారట. కల్కి హిట్ టాక్ తెచ్చుకుంటే.. కలెక్షన్స్ వర్షం కురవడం పక్కా.