Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో వేగం పెంచింది సినిమా యూనిట్. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని కామెడీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మారుతి డైరెక్ట్ చేస్తున్నారు.
READ ALSO: High Court: “కొడుకు”ను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిని శిక్షించే చట్టాలు లేవు..
ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటిసారిగా కామెడీ రోల్ చేయబోతున్నారు. గతంలో ఆయన చేసిన సినిమాల్లో అడపాదడపా సీన్స్‌లో మాత్రమే కామెడీ చేశారు, కానీ ఇది ఫుల్ లెన్త్ హారర్ కామెడీ సినిమాగా ఉండబోతుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా సుమ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ప్రభాస్ ముందు ఉంచింది. “ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎలా ఉండాలి?” అంటూ ఒక అభిమాని ప్లకార్డు చూపించగా, అదే ప్రశ్నను సుమ ప్రభాస్ ముందు ఉంచింది. ప్రభాస్ దానికి ఒక షాకింగ్ సమాధానం ఇచ్చాడు. “ఆ విషయం తెలియకే తాను ఇంకా పెళ్లి చేసుకోలేదు” అంటూ ప్రభాస్ పేర్కొనడం గమనార్హం.
READ ALSO: 2026 Bank Holidays List: 2026 బ్యాంక్ హాలీడేస్ ఇవే..
