Kalki 2898 AD Collections 1st Weekend Collections: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కల్కి సినిమా మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ‘బాహుబలి’ నుంచి ఈ మార్క్‌ను ప్రభాస్ సినిమాలు అందుకుంటున్నప్పటికీ.. కల్కి మాత్రం అరుదైన ఘనత సాధించింది.
బాహుబలితో ప్రభాస్ మొదటిసారి రూ.500 కోట్ల క్లబ్‌లోకి వచ్చాడు. బాహుబలి అనంతరం వచ్చిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. ఇందులో బాహుబలి 2 తప్పితే.. మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్‌లో 500-600 కోట్లు సాధించాయి. కల్కి 2898 ఏడీ మాత్రం తొలి వీకెండ్ పూర్తి కాకుండానే.. రూ.500 కోట్ల మార్క్‌ను అధిగమించి రేర్ రికార్డ్ నమోదు చేసింది.
Also Read: Kalki 2898 AD: అమెరికా బాక్సాఫీస్ షేక్.. మొదటి చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ రికార్డు!
నాలుగో రోజైన ఆదివారం సాయంత్రం ఫస్ట్ షో పడేటప్పటికీ కల్కి 2898 ఏడీ చిత్రం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ వీకెండ్ పూర్తయ్యేసరికి 11 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. బాహుబలి 2 మూవీ తొలి వారాంతంలో రూ.415 కోట్ల వసూళ్లు సాదించింది. ఇప్పుడు బాహుబలి రికార్డును కల్కి బ్రేక్ చేసింది. లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు కల్కి సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.