Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరంటే తెలియని వాళ్లు ఉండరు. తాజాగా కల్కి 2898ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్.. తన తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లోనే ఉండే విధంగా చేస్తున్నారు. ఇండస్ట్రీలో మొదటి పాన్ ఇండియా స్టార్ గా పిలిపించుకున్నాడు. బాహుబలి 2 నుంచి ప్రభాస్ దేశ వ్యాప్తంగా స్టార్ డమ్ తెచ్చుకోవడమే.. కాకుండా ఆయన పేరు విదేశాల్లో కూడా మార్మోగిపోతుంది. అక్కడ కూడా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని అందరూ ఫిక్స్ అయిపోయారు. సినిమా టాక్ ఎలా ఉన్నా మొదటి రోజు ఈజీగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తన సినిమాలతో అనేక రికార్డులు సెట్ చేసిన ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
Read Also:NTA: ఏం చేద్దాం చెప్పండి.. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పేరెంట్స్‌ని కోరిన కేంద్రం..
ఇండిమా ఫిలిం ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో సృష్టించలేని రికార్డ్ ప్రభాస్ సాధించాడు. ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఏకంగా ఐదు సినిమాలతో సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. ఏ బాలీవుడ్ హీరో సినిమాలకు కూడా ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఇన్ని లేవు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రభాస్ బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలతో మొదటి రోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశారు. బాహుబలి 2 సినిమా మొదటి రోజు రూ.217 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సాహో మొదటి రోజు రూ.130 కోట్ల కలెక్షన్స్, ఆదిపురుష్ మొదటి రోజు రూ.140 కోట్లు, సలార్ రూ.178 కోట్లు మొదటి రోజు వసూలు చేశాయి. ఇక తాజాగా రిలీజయిన కల్కి 2898ఏడీ సినిమా మొదటి రోజు రూ.180 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాకపోతే ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
Read Also:Minister Sandhya Rani: మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..