NTV Telugu Site icon

Prabhas, Maruthi Movie : ట్రెండ్ మార్చిన ప్రభాస్.. కామెడీ చేస్తున్న రెబల్ స్టార్

Prabhas Maruthi

Prabhas Maruthi

Prabhas, Maruthi Movie : ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాకు రెడీ అవుతున్నారు. దర్శకుడు మారుతితో ఆయన ఓ హార్రర్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రభాస్ ఒక క్విక్ ప్రాజెక్ట్‌గా చేస్తున్నారు. ప్రభాస్ రేపు పుట్టినరోజు(అక్టోబర్ 23) సందర్భంగా మారుతి, ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నారు.

ఈ ఏడాది ఇప్పటికే రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మన డార్లింగ్.. ఆ సినిమాపై మిక్స్‌డ్ టాక్ రావడంతో తన ఆశలంతా ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్‌పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల కాగా.. సర్వత్ర మిశ్రమ స్పందనల వ్యక్తమయ్యాయి. దీంతో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్.

Read Also: Yama Kinkarudu: చిరంజీవిని మాస్ కు చేరువ చేసిన ‘యమకింకరుడు’

ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రభాష్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి చిన్నపాటి షెడ్యూల్‌ జరగనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ నెలకు ఏడు రోజుల కాల్షీట్లు కేటాయించనున్నారట. అలా సినిమా అయ్యే వరకు నెలకు ఏడు రోజులు మాత్రమే డార్లింగ్.. మారుతీ చిత్రంలో పాల్గొనబోతున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం.

మారుతీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ నటించిన సలార్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతుంది. మారుతీ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో తనకు అవసరమైన సహాయ, సాకారాలను అందించనున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. ప్రభాస్ కు తాతగా కనిపించనున్నారని ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Also: దేవుడా.. టాలీవుడ్ లో ఇంతమంది తెలుగుమ్మాయిలు ఉన్నారా..?

ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించబోతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలిసింది. వీరు ఎవరన్నది త్వరలోనే స్పష్టత రానుంది.

Show comments