PPF Scheme: రూ.500 రూపాయల పెట్టుబడితో సులువుగా లక్షాధికారి అవ్వచ్చు! ఎలాగంటే?
- కేవలం 500తో PPF ఖాతా తెరవండి
- 7.1% పన్ను రహిత రాబడిని పొందండి
- 15 సంవత్సరాల క్రమపూర్వక పెట్టుబడి ద్వారా 40 లక్షల పైగా సంపాదన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PPF Scheme: ప్రతి ఒక్కరు వారు సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని సురక్షితంగా ఉండే మంచి రాబడిని పొందే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ నిర్వహించే అన్ని పథకాలు బాగా ప్రాచూర్యం పొందాయి. అలాగే భారీ రాబడిని కూడా బాగా ఇస్తున్నాయి కూడా. అలాంటి ఒక పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Scheme). ఇది తక్కువ రిస్క్ పన్ను రహిత పెట్టుబడి రాబడిని కోరుకునే పెట్టుబడిదారుల్లో అత్యంత ప్రజాధరణ పొందింది.
ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద పెట్టుబడిపై 7% కంటే ఎక్కువ వడ్డీని ఇస్తుండగా.. సాధారణ పెట్టుబడి ద్వారా కూడా భారీ నిధిని సేకరిస్తారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద ప్రభుత్వం పెట్టుబడిదారులకు 7.1% వార్షిక పన్ను రహిత వడ్డీని అందిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పథకం అధిక పన్ను పరిధిలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందంగా ఉంటుంది. ఈ స్కీంలో పెట్టుబడి 80C కింద పన్ను మినహాయింపుతో క్రమశిక్షణతో కూడిన పొదుపులను ప్రోత్సహిస్తుంది. పెట్టుబడిపై అందుకున్న వడ్డీ కూడా పన్ను రహితం. మెచ్యూరిటీ పై పొందిన మొత్తం కూడా పన్ను రహితం. ఈ పథకంలో లాకిన్ వ్యవధి 15 సంవత్సరాలు భారత ప్రభుత్వమే పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ పథకంలో పెట్టుబడిపై భద్రతకు హామి ఇస్తుంది.
Also Read
Italy: ఇటలీలో పెద్ద ఎత్తున అల్లర్లు.. ప్రధాని మెలోనికి వ్యతిరేకంగా పాలస్తీనీయులు నిరసనలు
ఇందు కోసం కేవలం రూ. 500 రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. PPF పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రభుత్వ పథకం గురించి ప్రత్యేకత ఏమిటంటే.. మీరు 15 సంవత్సరాల లాకిన్ వ్యవధి తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగించుకోవాలనుకుంటే దాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకు పొడిగించవచ్చు. పెట్టుబడిదారులు ఈ పథకం ద్వారా 15 సంవత్సరాల మెచూరిటీలో 40 లక్షలకు పైగా నిధిని ఎలా సేకరించవచ్చు.
మీరు ప్రతి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.5 లక్షలు దీనిలో పెట్టుబడి పెట్టాము అనుకుందాం. దీని ప్రకారం మీరు మీ ఆదాయం నుండి ప్రతి నెల 12,500 ఆదా చేసుకోవాలి. ఇలా 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చెల్లిస్తే మీ మొత్తం డిపాజిట్ 22,50,000 అవుతుంది. దీనికి 7.1% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ సమయంలో మీరు దీనిపై రూ.18,18,209 హామీతో కూడిన రాబడిని పొందుతారు.
Road Accident: ORRపై కారు బీభత్సం.. పలువురికి గాయాలు!
అంటే ఈ మెచూరిటీ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ.40,68,209 అవుతుంది. మీరు మీ సౌకర్యాన్ని బట్టి పెట్టుబడి మొత్తాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. పీపీఎఫ్ పథకం కింద ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఖాతాన్ని తెరవచ్చు. ఇది పెట్టుబడిపై రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ప్రారంభ పెట్టుబడి పెట్టిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు.. ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తర్వాత PPF ఖాతా నుండి ఉపసంహరణ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు