రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ తో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘పొట్టేల్’. ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింతగా పెంచింది. ఇక పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే ఎలాంటి అద్భుతాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇదివరకే విడుదలైన ఈ సినిమాలోని మొదటి 3 పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు సినిమా మేకర్స్ ఫోర్త్ సింగిల్ ను విడుదల చేసింది.
Postoffice Jobs : పది పాసైన వారికి గుడ్ న్యూస్..పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు..
శేఖర్ చంద్ర పవర్ ఫుల్ కంపోజిషన్, కాసర్ల శ్యామ్ అందించిన ఎమోషనల్ లిరిక్స్ తో వచ్చిన “బుజ్జి మేక” సాంగ్ ఈ సినిమా ఎసెన్స్ ని ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ ట్రాక్. ఈ పాట వినడానికి చాలా ఆకట్టుకుంది. కాల భైరవ వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసాయి. పాటలోని విజువల్స్ చాలా నేచురల్ గా ఉండడంతోపాటు., ఎమోషన్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సినిమాలో పనిచేసిన ప్రతిఒక్కరూ తమ బెస్ట్ వర్క్ అందించడంతో ‘బుజ్జి మేక’ హార్ట్ టచ్చింగ్ సాంగ్ గా అలరిస్తోంది. పొట్టెల్ సినిమా దర్శకుడు సాహిత్ మోత్ఖూరికి ఇది మూడో చిత్రం. ఇందులో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ పోషించారు.
Mango Kernels Benefits: మామిడి తిని పిక్కను పారేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అలా చేయరు
పొట్టేల్ మూవీకి నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగేలు నిర్మాతలు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీగా మోనిష్ భూపతి రాజు, ఎడిటింగ్ పనిని కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్షన్ నార్ని శ్రీనివాస్ లు చేస్తున్నారు. ఇక అతి త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సినీ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.