Post Office GDS Jobs 2024: తాజాగా ఇండియా పోస్ట్ నుండి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో దేశ వ్యాప్తంగా 44,228 ఉద్యోగాల ఖాళీల భర్తీ చేయనున్నారు. గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం ఈ ప్రకటన వెలువడించింది. ఇక మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 1,355, తెలంగాణలో 981 పోస్టులు భర్తీ కానున్నాయి. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగం పొందవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగంకోసం దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. ఇక ఎవరైనా నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం చూస్తుంటే అర్హులైన అభ్యర్థులు ఇందుకోసం ఆగస్టు 5వ తేదీ లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై ఆగస్టు 6 – 8 వరకు దరఖాస్తులో ఏవైనా సవరణలు ఉంటె అవకాశం కల్పిస్తారు. ఇక పూర్తి వివరాలకు అలాగే జాబ్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పోస్టల్ వెబ్ సైట్ సందర్శించాలి.
AP Government: పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం.. కొత్త పరిశ్రమల కోసం సర్కార్ కసరత్తు..
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించనున్నారు. వీటికోసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక జీతాల విషయానికి వస్తే నెలకు.. బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 – 29,380, అసిస్టెంట్ బ్రాంచ్‌పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.10,000 – 24,470 వరకు ఉంటుంది. ఇక వయోపరిమితి వివరాలు విషయానికి వస్తే.. 18 – 40 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ లకు 5 సంవత్సరాలు, ఓబీసీ లకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపులు వర్తిస్తాయి.
Warts Remove Naturally: ఎలాంటి నొప్పి లేకుండా పులిపిర్లను సహజంగా ఇలా తొలగించుకోండి!
అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మెరిట్ లిస్ట్ మార్కుల పరంగా షార్ట్‌లిస్ట్ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వీటికోసం కేవలం ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. జులై 15, 2024 ఆన్‌లైన్ దరఖాస్తులు మొదలవ్వగా.. ఆగస్టు 5, 2024 దరఖాస్తులకు చివరి తేదీ.