Union Budget: తాయిలాలతో హ్యాట్రిక్ కొట్టనున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ చదవనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది?, ఎలాంటి వరాలు ప్రకటించబోతున్నారోనన్న చర్చ నడుస్తోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మోడీ సర్కార్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజాకర్షక పథకాలను ప్రకటించే ఛాన్సుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ముఖ్యంగా పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు చాలా ఆశలే పెట్టుకున్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా నిత్యవసర ధరల పెరుగుదలతో నానా ఇబ్బందులు పడుతున్నరు. దీంతో ఈ బడ్జెట్‌లో ఊరట కలిగించే ప్రకటనలు ఉంటాయని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ సమయంలో పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఉన్నాయి. వీటిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రకటిస్తే వారు లబ్ధి పొందే ఛాన్సు ఉంది.
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
అలాగే మధ్య తరగతి ప్రజలు కూడా ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ధరలతో చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పన్ను శ్లాబ్‌పై మార్పులు ఉంటాయని నమ్మకం పెట్టుకున్నారు. రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ.5 లక్షల వరకు పెంచొచ్చని భావిస్తున్నారు. అదే గనుక జరిగితే మధ్య తరగతి కుటుంబాలు లాభం పొందే అవకాశం ఉంది.
ఇక పెరిగిన నిత్యవసర ధరలతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పప్పుల దగ్గర నుంచీ కూరగాయలు.. ఇలా ఒక్కొక్కటి ధరలన్నీ ఆకాశన్నంటాయి. ఈ నేపథ్యంలో ధరల తగ్గుదలకు ఏమైనా ప్రకటనలు ఉంటాయని ఎదురుస్తున్నారు. ఇలా ఆయా కేటగిరీ ప్రజలు కేంద్ర బడ్జెట్‌పై చాలా ఆశలనే పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓట్ల పండుగ జరగనుంది. మోడీ సర్కార్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కచ్చితంగా ప్రజాకర్షక పథకాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ బడ్జెట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!