NTV Telugu Site icon

World Cup 2023: ప్రపంచ కప్ 2023 ముగింపు వేడుకలో మెరువనున్న పాప్ స్టార్ దువా లిపా..!

Dua Lipa

Dua Lipa

ఐసీసీ ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరనున్న ఫైనల్ కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధమవుతోంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి.. ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో భారత్-ఆస్ట్రేలియా మధ్య టైటిల్ పోరు జరుగనుంది. అయితే ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీసీసీఐ ముగింపు వేడుక నిర్వహణపై ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. వరల్డ్ ఫేమస్ సింగర్ ‘దువా లిపా’ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని సమాచారం. దువా UEFA ఛాంపియన్స్ లీగ్‌తో సహా కొన్ని ఇతర క్రీడా కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చింది.

Read Also: Andhrapradesh: ఏపీలో జరుగుతోన్న బీసీ కులగణనపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

యూకేకి చెందిన ఈ లేడీ సింగర్ కు వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులు ఉన్నారు. తన ఆటపాటతో కోట్లలో అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవల పాడిన ‘హౌడిని ట్రాక్’ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి.. గ్లోబల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే 27 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. దువా లిపా ముగింపు వేడుకల్లో ప్రదర్శన ఇస్తున్నట్లు వరల్డ్ కప్ కు అధికారిక బ్రాడ్ కాస్టర్ గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ కూడా తెలిపింది. ఆమె ఆటపాటతో ఈ వరల్డ్ కప్ అద్భుతంగా ముగియనుందని స్టార్ స్పోర్ట్స్ చెప్పుకొచ్చింది.

Read Also: Deepfakes: “డీప్‌ఫేక్” అతిపెద్ద ముప్పు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..

ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనలిస్ట్‌లతో పరస్పర చర్యలో.. దువా లిపాను శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్, కేన్ విలియమ్సన్ మొదలైన క్రికెటర్లు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇంటరాక్షన్ సమయంలో.. మీరు ఏ పాటను ప్రదర్శిస్తారని గిల్ అడిగాడు. చూడాలి మరీ ఫైనల్ లో దువా ప్రదర్శన ఇస్తుందో లేదో…. ఇదిలా ఉంటే.. ఫైనల్ లో భారత వైమానిక దళం వైమానిక ప్రదర్శన చేస్తుందని ఇప్పటికే తెలిపింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ పది నిమిషాల పాటు ప్రజలను ఆకట్టుకుంటుందని గుజరాత్ డిఫెన్స్ పీఆర్వో ప్రకటించారు.