పూనమ్ కౌర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉండేది.. పలు సినిమాలు హిట్ టాక్ ను కూడా అందుకున్నాయి.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ వర్క్స్, రాజకీయాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు సమస్యలపై స్పందిస్తుంది పూనమ్ కౌర్.. ఎప్పుడూ ఏదొక వార్తతో హైలెట్ అవుతుంది..
ఇక తాజాగా తాను అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. తనకి ఫైబ్రోమైయాల్జియా అనే వైద్యం కోసం మంతెన గారి దగ్గరికి వచ్చాను. ఆ వ్యాధి వల్ల బట్టలు వేసుకోడానికి కూడా పెయిన్స్ వచ్చాయి. బాడీలో మూవ్ మెంట్స్ ఈజీగా ఉండవు. లూజ్ బట్టలు వేసుకోవాలి.. దీని ట్రీట్మెంట్ పై ఆయన ఇచ్చిన సూచనలు నాకు బాగా నచ్చాయి.. అవి నన్ను ఎంతగానో సపోర్ట్ చేశాయని చెప్పింది..
ఈ ఫైబ్రోమైయాల్జియా అంటే శరీరంలోని కండరాలు పట్టేయడం, అవి కదిలిస్తే నొప్పులు రావడం లాంటిది. దీనివల్ల బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యతో పూనమ్ కౌర్ కొన్నాళ్ళు బాధపడినట్లు తెలుస్తుంది. ఆమె సినిమాలకు దూరం అవ్వడానికి అదే కారణం అని పూనమ్ చెప్పుకొచ్చింది.. ఆమె సినిమాలకు దూరం అవ్వడానికి ఇది కూడా ఒక కారణం ఏమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సమస్యకు వైద్యం తీసుకున్నట్లు చెప్తుంది.. ఈ మధ్య స్టార్ హీరోయిన్లు చాలా ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారు..