NTV Telugu Site icon

Pooja : ఇక బుట్టబొమ్మ పని అయిపోయినట్లేనా.. అదే ఆఖరి అవకాశమా ?

Pooja Hegde

Pooja Hegde

Pooja : పూజా హెగ్డే కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరితోనూ కలిసి నటించింది. ప్ర‌భాస్, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, మ‌హేష్, నాగ‌చైత‌న్య‌, అఖిల్, వెంకటేష్ స‌హా టాప్ హీరోలు అవ‌కాశాలిచ్చి ఆమెను ఎంకరేజ్ చేశారు. అయితే తను చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాపులు అవుతుండడంతో కెరీర్ డౌన్ ఫాల్ మొద‌లైంది. టాలీవుడ్ లో కొన్ని అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి రాకుండా పోయాయి. అదే స‌మ‌యంలో పూజా త‌న స్టాఫ్ కి జీత‌భ‌త్యాల పేరుతో ప్రొడ్యూసర్ల నుంచి భారీగా డ‌బ్బు డిమాండ్ చేస్తోంద‌న్న విమర్శలు వెల్లువెత్తాయి.

Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

కార‌ణం ఏదైనా టాలీవుడ్ నుంచి పూజా అనూహ్యంగా కనుమరుగు అయింది. కోలీవుడ్ లోను అగ్ర హీరోలు అవ‌కాశాలిచ్చినా కానీ కెరీర్ కు ఉపయోగపడే సక్సెస్ రాకపోవడంతో అవకాశాలు అందుకోవడంలో వెనుకబడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే న‌టిస్తోంది. అక్కడ కూడా అర‌కొర అవ‌కాశాలే దక్కుతున్నాయి. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన `దేవా`లో పూజా హెగ్డేకు అవ‌కాశం ద‌క్కింది. ఇందులో షాహిద్ క‌పూర్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ వచ్చింది. కానీ ఇది కూడా త‌న‌కు అంత‌గా క‌లిసిరాద‌ని అర్థం అవుతుంది.

Read Also:Hero Ajith : రేసింగ్ లో దుమ్ములేపిన అజిత్.. దేశ వ్యాప్తంగా ప్రశంసల వెల్లువ

ఇందులో షాహిద్ డామినేష‌న్ ముందు ఏదీ నిలబడదన్నది అక్షర సత్యం. ఇత‌ర న‌టీన‌టులు అస్సలు క‌నిపించ‌డం లేదు. అత‌డు రౌడీ పోలీస్ పాత్రలో ఇదరదీశాడు. షాహిద్ గెట‌ప్, డ్యాన్సులు, యాక్ష‌న్, మాసిజం ప్రతీదీ విజువ‌ల్ గా హైలైట్ కావ‌డంతో పూజా హెగ్డే అంత‌గా హైలైట్ కాలేదు. టోన్ డౌన్ గా చూపించ‌డం చూస్తుంటే, ఈసారి కూడా త‌న‌కు గుర్తింపు ద‌క్కడం క‌ష్టమని స్పష్టం అవుతుంది. ఇటీవల భాసద్ మచ్చా అనే పాట‌ను విడుదల చేశారు. దీనిలో షాహిద్ ఎన‌ర్జిటిక్ స్టెప్పుల ముందు తను అసలు కనిపించడమే లేదు. అత‌డు బేసిగ్గానే అద్భుత‌మైన డ్యాన్స‌ర్ కావ‌డంతో ఇత‌ర పాత్రలు హైలైట్ గా క‌నిపించ‌డం లేదు. పూజా పాత్రను పూర్తిగా కప్పేసిన్లుగా కనిపిస్తోంది. భారీ యాక్ష‌న్ చిత్రం దేవా విజ‌యం సాధిస్తే, అది పూజాకు మ‌రో అవ‌కాశం ఇస్తుంది. లేదంటే ఇదే ఆమెకు చివరి అవ‌కాశంగా భావించవచ్చు.

Show comments