NTV Telugu Site icon

Pooja Hegde : మొత్తానికి ఓ పట్టు దొరికిచ్చుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే

Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde : దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల వరుస ఫ్లాపులతో కాస్త వెనుకపడిపోయింది. కెరీర్ మొదట్లో ఆమె ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తర్వాత అల్లు అర్జున్ తో కలిసి ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో తొలి కమర్షియల్ బ్రేక్ అందుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అలాగే సక్సెస్ లు కూడా అందుకుంది. స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయిస్ గా పూజా హెగ్డే మారిపోయింది. 2021లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ వరకు ఆమెని ఆపేవారే లేరు. అయితే తర్వాత పూజా హెగ్డే కెరియర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. పూజా హెగ్డే మొదటి సినిమా చేసింది తమిళంలోనే. జీవాకి జోడిగా ‘ముగన్ మూడి’ అనే చిత్రంలో నటించింది. మరల 10 ఏళ్ల తర్వాత 2022లో ‘బీస్ట్’ చిత్రంలో దళపతి విజయ్ కి జోడీగా తమిళంలో ఆమె రెండో సినిమా చేసింది. ఈ మూవీకి బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ వచ్చింది.

Read Also:Varuntej : ‘మట్కా’పైనే వరుణ్‌తేజ్‌ ఆశలన్నీ.. హిట్టు దక్కేనా..?

దానికంటే ముందుగా తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ తో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకుంది. తరువాత రామ్ చరణ్ చిరంజీవిలతో వచ్చిన ‘ఆచార్య’ డిజాస్టర్ అయ్యింది. హిందీలో రణవీర్ సింగ్ కి జోడీగా చేసిన ‘సర్కస్’, అలాగే సల్మాన్ కి జోడీగా చేసిన ‘కిసికా భాయ్ కిసీకి జాన్’ సినిమాలు కూడా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఈ సినిమాలతో ఆమె కెరీర్ కూడా ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. 2024లో పూజా హెగ్డే నుంచి ఒక్క సినిమా కూడా థియేటర్స్ లోకి రాలేదు. ‘రాధేశ్యామ్’ తో పాన్ ఇండియా స్టార్ ని అయిపోతానని ఎన్నో కలలు కన్న పూజా హెగ్డేను ఆ మూవీ కోలుకోలేని దెబ్బ దెబ్బ తీసింది. ఇక పూజా హెగ్డే కెరియర్ అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. అనూహ్యంగా ఆమెకి కోలీవుడ్ ఇండస్ట్రీ భరోసా ఇచ్చింది.

Read Also:MIG 29 Crash: కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం.. (వీడియో)

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. అలాగే దళపతి విజయ్ 69వ మూవీలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అయింది. అలాగే హిందీలో షాహిద్ కపూర్ కి జోడీగా ‘దేవ’ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూడు సినిమాలతో పాటు మరో రెండు తమిళ సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక మళ్లీ కెరీర్ ట్రాక్ లో పడుతుందని బుట్టబొమ్మ బలంగా నమ్ముతోంది. ఎక్కువగా విజయ్ ఆఖరి సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. ఇకపై మొత్తానికి గ్యాప్ రాకుండా కెరీర్ పై కాస్త పట్టు సాధించింది. మరి తననుంచి వచ్చే కొత్త సినిమాలు ఆమెను ఏ స్థాయిలో నిలబెడతాయో చూడాలి.

Show comments