Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోమారు బీసీల గురించి చర్చను లేవనెత్తారు. తాజాగా మంత్రి బీసీల విషయమై స్పందిస్తూ.. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకని మరోసారి నిరూపించుకుందని అన్నారు. ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్నా.. అలాగే అనేకమంది బీసీ సీనియర్ నేతలు ఉన్నా సరే.., అలాగే బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి కనీసం సభాపక్ష నాయకుడుని కూడా బీసీలకు ఇవ్వలేదని ఆగ్రహించారు.
Read Also:Kannappa Movie: ఊహకు మించి ‘కన్నప్ప’.. ‘మైల్ స్టోన్’ చిత్రం అవుతుంది: డిప్యూటీ సీఎం
అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఓ ఫ్యూడల్ పార్టీ. బీజేపీలో బీసీలకు ఎప్పుడూ న్యాయం జరగలేదు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ వెయ్యనివ్వకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మీ పార్టీ నాయకులే వాపోతున్నారు.. దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. ఇకపోతే, సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
Read Also:Sri Ganesh: ట్రాఫిక్ పోలీసులపై గుర్రుమన్న ఎమ్మెల్యే.. సమస్య పరిష్కరించకపోతే ధర్నా చేస్తా..!
బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే, టీపీసీసీ అధ్యక్షుడిని బీసీని చేసుకున్నామన్నారు. మేము ఒకవైపు కుల గణన చేసుకొని బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ శాసన సభలో చట్టం చేసుకొని సామాజిక న్యాయం కోసం ముందుకుపోతుంటే.. బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసిందని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారన్నారు. తెలంగాణలో దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అంటూ తెలియచేశారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసారని గుర్తు చేశారు.
