NTV Telugu Site icon

Ponnam Prabhakar : ఈనెల 16న హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar : ఈనెల 16 న గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా , బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 16 వ తేదీ సోమవారం రోజున గాంధీ భవన్ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Sukhvinder Sukhu: సీఎంను చుట్టుముట్టిన “కోడి కూర” వివాదం.. అసలేం జరిగింది? (వీడియో)

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యాచరణ, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పటిష్టత, పార్టీ సంస్థాగ్రత అభివృద్ధి తీసుకోవల్సిన చర్యలు, ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం, పార్టీ కోసం కష్టపడిన వారికే పార్టీ, ప్రభుత్వ పదవులు, డివిజన్‌లో వారీగా పార్టీల కమిటీలు తదితర ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. సమావేశంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్యేగా పోటీ చేసిన 15 నియోజకవర్గాల అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, పార్టీ ఉపాధ్యక్షులు ,డిసిసి అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రటరీలు ,మాజీ పీసీసీ అధ్యక్షులు కార్పోరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులు, ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.

Asaduddin Owaisi: “బీజేపీ టార్గెట్ అదే”.. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో ఒవైసీ కీలక వ్యాఖ్యలు

Show comments