NTV Telugu Site icon

Ponnam Prabhakar : తెలంగాణ, భారత్‌లో భాగం కాదా.?

Ponnam Prabhakar

Ponnam Prabhakar

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాగ్వాదాల నడుమ నడిచింది. కేంద్రాని ప్రశ్నించేందుకు ఎందుకు కలిసి రారు అని బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ టార్గెట్‌ చేయగా.. కేసీఆర్‌పై కోపంతో రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు వాదనలు చేశారు. అయితే.. చివరగా.. కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్రం అన్యాయం జరిగిందనే అభిప్రాయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ అంటే మొదటి నుంచి ప్రధాని మోడీకి చిన్నచూపు అని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును మోడీ ఎన్నోసార్లు అవమానించారని ఆయన మండిపడ్డారు.

NEET: బెంగాల్ అసెంబ్లీలో కీలక పరిణామం.. నీట్ రద్దు చేయాలని తీర్మానం

కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు ఏం తెచ్చారు.? వంద సీట్లలో డిపాజిట్‌ రాని బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై బీజేపీ నేతలు మాట్లాడరా.? అని, సుష్మా స్వరాజ్‌ను చిన్మమ్మ అని పిలుచుకుంటున్నామని, తెలంగాణ, భారత్‌లో భాగం కాదా.? అని మంత్రి పొన్నం అన్నారు. కేంద్రంలో కుర్చీ కాపాడుకోడానికే ఏపీ, బీహార్‌కు నిధులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆత్మహత్యలు జరుగుతుంటే కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఏం చేస్తున్నారు.? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.

J&K Terror Attacks: ఉగ్రవాదులు జైలుకు లేదా “నరకానికి”.. పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం..