ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు ప్రకటించడంతో కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. కోర్టు తీర్పునిచ్చినా.. ఇంకా 30 రోజుల జైలు శిక్షకు ఇంకా 30 రోజుల సమయాన్ని ఇచ్చిందని.. ఏవిధంగా కోర్టు తీర్పును కారణంగా చూపుతూ రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేస్తారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ జైల్ కి వెళ్లాడా..? అని ఆయన ప్రశ్నించారు. జైలుకి వెళ్తే.. అనర్హత వేటు వేశారంటే పద్ధతి అని, కానీ.. ఈ సమయంలో అనర్హత వేటు వేసే హక్కే లేదన్నారు.
Also Read : Supreme Court: కొవిడ్ సమయంలో విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లో లొంగిపోవాలి
రెండేళ్ల శిక్ష విధించిన జడ్జె… 30 రోజుల గడువు ఇచ్చారని, సూరత్ కోర్టు తీర్పే ఫైనల్ కాదన్నారు ప్రభాకర్. పార్లమెంట్ కి ఇది చీకటి రోజని ఆయన అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ ఎండగట్టారని.. దీంతో మోడీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మోడీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభాకర్. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Also Read : Rahul Gandhi: భారత్ కోసం పోరాడుతున్నాం.. ఎంతవరకైనా సిద్ధం