Site icon NTV Telugu

Ponnam Prabhakar : అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా.. పొన్నం ప్రభాకర్‌ సవాల్‌

Ponnam Prabhaker

Ponnam Prabhaker

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ దశాబ్ద కాలం అయిన పూర్తి చేయలేదని మండిపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామంటున్నారని, అసలు కాలువలు నిర్మించకుండా రైతుల పొలాలకు సాగు నీరు ఎలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు.

Also Read : Lust Stories 2 : లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా..

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అటు ఎంపీ గా ఐదు సంవత్సరాల కాలంలో, ఇటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం 10 సంవత్సరాల కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. తాను ఎంపీగా ఐదు సంవత్సరాల కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేశానో చూపిస్తా చర్చకు సిద్ధమా అని పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల హుస్నాబాద్ కు వచ్చిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఛత్తీస్‌గడ్‌లో జరిగిన అభివృద్ధి పై అక్కడికి వెళ్లి చూద్దామన్నారు, దానికి మేము సిద్ధమని పొన్నం తెలిపారు.

Also Read : Bro Teaser: అస్వస్థతతో వారాహి యాత్రలో ఉన్నా డబ్బింగ్ పూర్తి చేసిన పవన్.. ఓజీ ట్రీట్ రెడీ!

Exit mobile version