Lust Stories 2 : లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్నా కు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ సిరీస్ “జీ కర్థ”అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఆ సిరీస్ లో ఈ అమ్మడు రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది..తమన్నా ఎప్పుడూ చేయని బోల్డ్ సీన్స్ ఈ వెబ్ సిరీస్ లో చేసింది. అలాగే ఆమె నటించిన మరొక కొత్త వెబ్‌సిరీస్ ‘లస్ట్ స్టోరీస్2′ ఈనెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది సదరు నిర్మాణ సంస్థ. ఇందులో భాగంగా తమన్నా తన ట్విటర్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ చూసేప్పుడు ఎవరైనా వస్తే మధ్యలో నే ఆపేయాల్సిన పని లేదని ఆమె చెప్పుకొచ్చింది.
”లస్ట్ స్టోరీస్2’ ఎన్నో రకాల ఎమోషన్స్ తో కూడింది అని ఆమె తెలిపింది.. లస్ట్ అనే పేరు చూసి ఎవ్వరు కూడా భయపడకండి. ఇందులో అందరి ప్రేమను ఎంతో అద్భుతంగా చూపించారు.ఈ సిరీస్ చూసేటప్పుడు ఎవరైనా వస్తే కంగారు పడకండి సిరీస్ ను మధ్యలోనే ఆపేయకండి. అందరితో కలిసి దీన్ని చూడవచ్చు.అలా చూస్తే ఏమవుతుంది,తప్పేమి లేదు,తుఫానేమీ రాదు, ఆకాశం ఏమి ఊడి పడదు. మరెందుకు భయం రిలాక్స్ అవుతూ కూల్ గా ఈ సిరీస్ ను చూడండి అని తమన్నా ఆ వీడియో లో చెప్పింది. అయితే దీనిపై నెటిజన్లు ఎంతో ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు.ఈ రొమాంటిక్ డ్రామాలో భాగంగా నటుడు మరియు తన ప్రియుడు అయిన విజయ్ వర్మ తో తమన్నా ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయింది.దీని కోసం సుమారు 18 ఏళ్ల నుంచి తాను ఫాలో అవుతోన్న నో కిస్ పాలసీని కూడా బ్రేక్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.దీనిపై ట్రెండ్ తగ్గట్టు గా ఆర్టిస్ట్ లు నటనలో వైవిద్యం చూపాలని ఆమె పేర్కొనింది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్ల తర్వాత ఫేమస్ అవ్వాల్సిన అవసరం తనకు లేదని కూడా ఆమె స్పష్టం చేసింది. ‘లస్ట్ స్టోరీస్’ మొదటి భాగం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘లస్ట్‌స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ ను తీసుకు వచ్చారు. ఈ సిరీస్ కూడా అంతటి రేంజ్ లో హిట్ అవుతుందని మేకర్స్ ధీమాగా వున్నారు..
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!