The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Odyssey Ticket Price : సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది. ట్రైలర్ కూడా పూర్తిగా బయటకు రాలేదు. అయినా టికెట్ల కోసం అభిమానులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒక సినిమా చుట్టూ ఇంతటి ఉత్సాహం, ఇంతటి అంచనాలు కనిపించడం చాలా అరుదు. ప్రస్తుతం ప్రపంచ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘ది ఒడిస్సీ’. ప్రముఖ దర్శకుడు Christopher Nolan తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో నోలన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. Inception, The Dark Knight, Interstellar వంటి చిత్రాలతో ఆయన కథ చెప్పే విధానం, విజువల్ ప్రెజెంటేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అందుకే ఆయన కొత్త సినిమా ప్రకటించిన ప్రతిసారి ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంటుంది. అయితే ‘ది ఒడిస్సీ’ విషయంలో ఆ ఆసక్తి అంచనాలను దాటి వెళ్ళిపోయింది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా టికెట్లు రీసేల్ మార్కెట్లో భారీ ధరలకు అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రీమియం షోలు, ప్రత్యేక 70ఎంఎం ఐమ్యాక్స్ ప్రదర్శనల టికెట్లు ఆన్లైన్ రీసేల్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 1500 డాలర్ల వరకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ కరెన్సీలో ఇది సుమారు లక్షా నలభై వేల రూపాయలకు సమానం. ఒక సినిమా టికెట్ కోసం ఇంత మొత్తం చెల్లించేందుకు అభిమానులు సిద్ధపడటం ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను స్పష్టంగా చూపిస్తోంది.
ఈ హైప్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి సినిమా నిర్మాణ విధానం. ‘ది ఒడిస్సీ’ను పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించినట్లు సమాచారం. ముఖ్యంగా 70ఎంఎం ఐమ్యాక్స్ స్క్రీన్లపై ఈ చిత్రాన్ని చూడటం ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నోలన్ సినిమాలను పెద్ద తెరపై చూడటమే అసలైన అనుభవమని భావించే అభిమానులు ఈ అవకాశాన్ని మిస్ కావాలని అనుకోవడం లేదు. ఇక ఈ చిత్రంలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, ఛార్లిజ్ థెరాన్ లాంటి హేమాహేమీలు నటిస్తున్నారు. వంటి ప్రముఖ తారలు నటిస్తున్నారు. ఈ స్టార్ కాస్ట్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ప్రస్తుతం ప్రపంచ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం జూలై 17న భారీ స్థాయిలో విడుదల కానుంది. విడుదలకు ముందే ఇంతటి సంచలనం సృష్టిస్తున్న ‘ది ఒడిస్సీ’ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలనే ఆసక్తి సినీ ప్రపంచమంతటా నెలకొంది.
- Tags
- cinema
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..