తెలంగాణ ప్రభుత్వం చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధృవీకరణ పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇంఛార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఆయనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఇతర ఉన్నతాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దల సంరక్షణ కరువైన, పేరెంట్స్ లేని ప్రభుత్వ ,ప్రైవేట్ చిల్డ్రన్ హోమ్స్ లో ఉన్న పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా బర్త్, కాస్ట్ , సదరం సర్టిఫికెట్లు ,ఆధార్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 2700 మంది పిల్లలకు సర్టిఫికెట్లు అందిస్తుంది జీహెచ్ఎంసీ. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సర్టిఫికెట్ పొందుతున్న పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, టీమ్ అంతా కలిసి 2700 మంది పిల్లలకు తక్కువ సమయంలో వివిధ రకాల సర్టిఫికెట్ లు అందిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఉన్న శిశు విహార్ పిల్లలకు తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలకు ,బాధ్యత నుండి తప్పించుకున్న వారు ప్రభుత్వం మీద వేశారు.. ప్రభుత్వం తరుపున శిశు విహార్ రక్షణ గా నిలబడుతుందన్నారు. విద్యా, ఉపాధి, భవిష్యత్ లో సమాజంలో గుర్తింపు లేని వారికి ప్రభుత్వం గుర్తింపు ప్రామాణిక కార్డు ని ఇస్తుందన్నారు.
Producer SKN: ఫిలిం ఛాంబర్ పై ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా.. ‘సంస్థ నుండి ప్రామాణికమైన గుర్తింపు కార్డు పొందుతున్నారు.. మీ అందరికీ అభినందనలు.. 50 కేంద్రాల్లో 2300 మంది విద్యార్థులు ఉన్నారు.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుంది.. ఆదరణ తక్కువైన వారు ఆర్థికంగా కుటుంబ భారం మోయలేక పిల్లలను కూడా ఈ సంస్థల్లో చేరుస్తున్నారు.. ఎవరు కూడా అనాథలుగా , ఆభాగ్యులుగా రోడ్డు మీద ఉండకుండా ఈ సంస్థ మరిన్ని సేవలు అందించాలి.. మొన్న నారాయణ సేవా సంస్థాన్ సేవలు కూడా ఆశ్చర్యం అనిపించింది.. అంగ వైకల్యం ఉన్న వారికి వారు ఆదుకొని ఆర్టిఫిషియాల్ అవయవాలు అందించి మళ్ళీ పునర్జీవం పోస్తున్నారు.. జీవితం లో క్రీడలు ,సాంస్కృతిక కార్యక్రమాల్లో యధావిధిగా పాల్గొనే విధంగా చేస్తున్నారు.. మీకు కూడా గుర్తింపు తెచ్చే విధంగా స్త్రి శిశు సంక్షేమ శాఖ చిల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ పని చేస్తున్నాయి.. రాష్ట్రంలో ఎక్కడ కూడా అనాధలుగా ఉండిపోయాం.. ఆదరణ లేదని ఉండదు.. ఎక్కడ ఎవరైనా ఆనాధలుగా ఉన్న పరిస్థితి ఉంటే వాళ్ళందరిని స్త్రి శిశు సంక్షేమ శాఖ చైల్డ్ కేర్ దృష్టికి తీసుకురావల్సిన అవసరం ఉంది .. ఇది అధికారుల బాధ్యత ఒక్కటే కాదు.. సామజిక బాధ్యత కూడా.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ బృందానికి , స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అభినందనలు..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Gaanza Shankar: ఆగిపోయిన మెగా మేనల్లుడి సినిమా.. కారణం అదేనా..?
