దేశ ఎన్నికల ఖర్చు భరిస్తా అని కేసీఆర్ అన్నట్టు ప్రచారంలోకి వచ్చిందని, సీఎం కాక ముందు.. ఆయన పరిస్థితి ఎంటన్నది అందరికి తెలుసునని, మరి.. బీఆర్‌ఎస్‌కి ఇంత ఆస్తి ఎక్కడి నుండి వచ్చిందన్నారు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. యూపీ ఎన్నికలకు డబ్బులు పంపింది బీఆర్‌ఎస్ అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. మోడీ.. ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ మంచి సంస్థలేనని, కానీ 2014 ముందు ఎలా ఉంది… బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలా ఉందనేది చూడాలన్నారు.
Also Read : Srirama Navami Wonder: శ్రీరామనవమి వేళ అద్భుతం.. ఆ ఇంట్లో వానరం సందడి
మోడీ అధికారంలోకి వచ్చాకా పెట్టిన కేసులు … క్లోస్ చేసిన కేసులు ఎన్నో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ సూచనలతో విచారణ సంస్థలు పనిచేస్తున్నాయని, 2014 ఎన్నికల్లో నల్లధనం బయటకు తెస్తా అని మోడీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి విరాళాలు ఎలా వచ్చాయో బయట పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. జీఎస్టీ పన్నులు వసూలు గొప్ప అని చెప్పుకున్నాయని ఆయన అన్నారు. 70 శాతం పన్నులు వసూలు చేస్తుంది సామాన్య జనం నుండే కదా అని ఆయన అన్నారు.
Also Read : Highcourt: గోవుల అక్రమ రవాణాపై హైకోర్ట్ విచారణ