ప్రధాని మోడీ నేడు తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మోడీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్ర పొన్నాల లక్ష్మయ్య విమర్శలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తెలంగాణ రావడం సంతోషమని, కానీ ఎనిమిది ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత శంకుస్థాపన కు వచ్చింది లేదు… ప్రారంభించిన పనే లేదని, కేసీఆర్.. మోడీ ఇద్దరూ ఇద్దరేనని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. మోడీ పర్యటనలో కనీసం తెలంగాణ సీఎంకి పిలుపు లేదని, మోడీ మెట్రో ప్రారంభించారని, అది కంప్లీట్ చేసింది కాంగ్రెస్ అన ఆయన అన్నారు.
Also Read : Case against Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కేసు నమోదు
గజ్వేల్ లో భగీరథ పనులు ప్రారంభించారని, నీటి తరలింపు చేసింది మేము.. ప్రారంభించింది మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించే ప్రక్రయ మొదలు పెట్టింది కాంగ్రెస్ అని, ఎనిమిది ఏండ్లు ఏం చేయకుండా … ఇప్పుడు ప్రారంభం అని వచ్చారని ఆయన మండిపడ్డారు. విభజన హామీల్లో ఒక్కటైన అమలు చేశారా..? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటిపారుదల వ్యవస్థ కేంద్రం చేతిలోకి తీసుకోవడం సిగ్గుచేటని పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. రెండేళ్ల క్రితం మొదలైన రామగుండం ఫ్యాక్టరీ ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏంటి..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
