Ponguleti Sudhakar Reddy : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కిష్టారం అంబేద్కర్ నగర్, బీసీ కాలనీలకు కాలుష్యాన్ని వెదజల్లుతున్న సైలో బంకర్‌పై పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన కిష్టారం గ్రామంలో పర్యటించి మాట్లాడుతూ.. కాలుష్యం భారీ నుండి కిష్టారం గ్రామాన్ని రక్షించండన్నారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారని, చనిపోయిన వారి ఫోటోలు చూస్తా ఉంటే చాలా బాధగా ఉందన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఎన్నికల ప్రచారం ఉన్నప్పటికీ .. నా ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అని ప్రధాన సమస్య గా గుర్తించి ఇక్కడకి రావడం జరిగిందన్నారు. ఈ సమస్య నా దృష్టికి రాగానే మీ గొంతుక గా మారి CMD తో మాట్లాడటం జరిగిందని, సైలో బంకర్ నార్మ్స్ ప్రకారం కట్టకుండా అంబేద్కర్ నగర్ ను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాలుష్యం వలన చనిపోయిన వారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతున్నానని, జీవన్మరణ సమస్య గా దీన్ని పరిగణిస్తున్నామన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో మాట్లాడి సింగరేణి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా సమస్య ను పరిష్కరిస్తామని, నా పరిధిలో నావల్ల అయ్యే సహాయం నేను చేస్తానని మాట ఇస్తున్నా పొంగులేటి సుధాకర్ అన్నారు.
SVSN Varma: వివాదంగా మారిన టీడీపీ నేత వర్మ ట్వీట్!
అంతేకాకుండా..’ప్రజా ప్రభుత్వం,ప్రజా పాలన అని చెప్పుకునే ఈ రాష్ట్రం లో ఈ సమస్య గుర్తించక పోవడం దురదృష్టం.. మా శాయశక్తుల మీ సమస్య కోసం పోరాడతాము.. బంకర్ ను తొలగించే అవకాశం ఉంటే అది తరలించాలి.. లేదా గ్రామాన్ని ఇక్కడ నుండి వేరే చోటకి మార్చాలి అని సింగరేణి ను డిమాండ్ చేస్తున్నాం.. జిల్లా కి ముగ్గురు మంత్రులు ఉన్నారు.. దీన్ని రాజకీయం చేయకుండా సమస్య ను పరిష్కరించాలని ముగ్గురు మంత్రులను కోరుతున్నాం.. ఈ సమస్య ను కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి తెలియజేస్తా.. ప్రధాన మంత్రి దృష్టిలో ఈ సమస్యను తీసుకుపోతాం
– ఇది చాలా గంభీరమైన సమస్య కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని పరిష్కారం చేయాలి.. కేంద్రం నుండి కావలసిన సాయం మేము చేస్తాం.. 100 మంది బీఈడీ విద్యార్దులు ఈ ప్రాంతంలో ఉన్నారని గ్రామస్థులు తెలిపారు.. వాళ్లందరి భవిష్యత్ కు సంబంధించిన విషయం కాబట్టి సమస్య ను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం.. త్వరలోనే సమస్య పరిష్కరించబడుతుంది దానికి మీకు శుభాకాంక్షలు’ అని పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్‌పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..