NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తా

Ponguleti

Ponguleti

తెలంగాణలో ఎన్నికల జోరు పెరిగింది. ఆయా పార్టీలు ప్రజలును ఆకర్షించేందుకు వారి పార్టీలు ప్రకటించిన మేనిఫేస్టోతో పాటు.. మరిన్ని వరాలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రచారం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 72-78 గెలుచుకో బోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు పొంగులేటి. మీరు అభిమానించే మీ శ్రీనన్న ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉండబోతున్నాడన్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తానన్నారు. కొత్తగూడెం నేను నిలబడే ఆలోచన చేయలేదు, నేను నిలబడే నియోజకవర్గం కోసం, నా కోసం నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదన్నారు. నేను పోటీ చేస్తున్న చేస్తున్న పాలేరు నియోజకవర్గం కంటే మిగతా నియోజకవర్గాల్లో 75శాతం టైం కేటాయిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ ఆదేశానుసారం పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ కి కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి అభిమానులుగా పార్టీ ఆదేశానుసారం చిత్తశుద్ధితో పనిచేస్తే కూనంనేని సాంబశివరావు గెలుపు తథ్యమన్నారు.

Also Read : Sreeleela: శ్రీ లీల ప్రేమలో పడిందా? ఇదేంటి ఇలా షాక్ ఇచ్చింది?

అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నేను కూడా పోటీ చేయాలని అనుకోలేదు కానీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర పార్టీ నాయకులు ఒత్తిడి, నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా సీపీఐ నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నాను. పొంగులేటి వన్ మాన్ ఆర్మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పొంగులేటికి ప్రజా బలం ఉంది తనను వేరే విధంగా ఆలోచన చేయొద్దు. పాలేరు లో సీపీఐ పొంగులేటికి పూర్తి మద్దతు ఇస్తున్నది, ఖమ్మం లో తుమ్మల నాగేశ్వరరావు కు సీపీఐ మద్దతు ఇస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఆశించిన విధంగా 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు మిత్రపక్షాలు గెలుపు తథ్యం. కొత్తగూడెం స్థానం గెలవక పోతే వ్యక్తిగతంగా తనకు, తన పార్టీకి, మిత్ర ధర్మం పాటించలేదని కాంగ్రెస్ కు చెడ్డ పేరు వస్తుంది. ఎవరికీ ఇబ్బందులు కలిగించను, ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించను. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. పదవి కోసం పోటీ చేయడం లేదు.’ అని ఆయన అన్నారు.