NTV Telugu Site icon

Ponguleti: మీరు ఇంటికి పోవడం పక్కా.. తెలంగాణలో వచ్చేది మేమే..!

Ponguleti

Ponguleti

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవ్వరినీ గెలువనియ్యను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు దడ పుట్టింది.. చావు నోటి వరకు వెళ్లి తెలంగాణ తీసుకుని వచ్చనన్ని కేసీఆర్ చెబుతుంటారు.. అనాడు పండ్ల రసం డ్రింక్ త్రాగింది నిజం కదా.. ఉద్యమంలో యాక్టింగ్ చేశావు తప్ప మరేమీ లేదు అని పొంగులేటి అన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే ప్రజలను భయ బ్రాంతులను చేయడంలో నిష్ణాతులు అని ఆయన తెలిపారు. పోలీసు యంత్రాంగాన్ని వాడి మొన్న రాహుల్ గాంధీ సభకు రాకుండా చేసింది నిజం కాదా.. సమయం ఆసన్నం అయ్యింది అని పొంగులేటి పేర్కొన్నారు.

Read Also: Pawan Kalyan: అబ్బా.. ఏమున్నాడురా బాబు

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది.. డిసెంబర్ 9 వ తేదీన కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్ఆర్, ఎన్టీఆర్ ప్రభుత్వం మాదిరిగానే సంక్షేమ ప్రభుత్వం వస్తుంది అని ఆయన వెల్లడించారు. అక్రమ సంపాదనను వడ్డీతో సహా కక్కిస్తాం.. మొన్నటి నుంచి చెలరేగి పోతున్నారు.. కార్యకర్తలను వేధింపులకు గురి చేసి కేసులు పెడుతున్నారు.. 60 రోజుల్లోనే మీరు ఇంటికి పోతారని పొంగులేటి అన్నారు. మేము రంగంలోకి దిగితే బీఆర్ఎస్ నేతల భరతం పడతామని ఆయన వ్యాఖ్యనించారు.

Read Also: Shocking Video: రైలు కింద పడ్డ బతికి బట్టకట్టింది.. ఈ కుక్కకు నూకలున్నాయి..!

మీ రాజకీయం మీరు చేసుకోండి.. కాంగ్రెస్ నాయకులను కాపాడుకోవడం ఎలాగో మాకు తెలుసు అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నమ్ముకున్న క్యాడర్ ను ఇబ్బందులు పెడితే సహించేది లేదు.. మీరే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.. ప్రజలు రావణాసురుడు పరిపాలన కావాలని కోరుకోవడం లేదు.. రాముడి పరిపాలన కావాలని కోరుతున్నారని పొంగులేటి తెలిపారు. రోడ్డు మీదకు వస్తాను.. కార్యకర్తలను కాపాడుకుంటాము.. మీరు చెక్ పోస్టులు ఎన్ని పెట్టిన మీ పతనం దగ్గరలోనే ఉంది అని ఆయన పేర్కొన్నారు. కొద్ది మంది అధికారులు హుషార్ చేస్తున్నారు.. ప్రజలను ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామని పొంగులేటి చెప్పారు. ఖమ్మం నుంచే పోలీస్ స్టేషన్ల ముట్టడి ప్రారంభం అవుతుందని తెలిపారు.