Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy: ఆ రెండు పార్టీలు ఒక్కటే.. వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..

Ponguleti

Ponguleti

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శేర్లింగంపల్లిలో కాంగ్రెస్ భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి మేలు జరుగుతుంది.. సీఎం కేసీఆర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ఏ ఒకటి నెరవేర్చలేదు.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిరుపేదలకు ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు.

Read Also: Jyotika: ఒక చంద్రముఖి.. ఇంకో చంద్రముఖిని మెచ్చిన వేళ..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుసుకున్న ప్రజల కష్టాలు నెరవేరేలా కృషి చేస్తారు.. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే.. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అమలు కాని హామీలు గుప్పిస్తారు అని తెలిపారు. నిరుద్యోగ భృతి పేరుతో యువకులను మోసం చేశారు అని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి పేద వాడికి అండగా ఉంటామన్నారు. 500 రూపాయల కే గ్యాస్ ను అందజేస్తాం.. ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకు వస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ మాటలు నమ్మితే రాష్ట్రం అగమవుతుందని ఆయన తెలిపారు.

Read Also: G20 Summit: జీ20 సమ్మిట్.. రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..

Exit mobile version