Jyotika: ఒక చంద్రముఖి.. ఇంకో చంద్రముఖిని మెచ్చిన వేళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyotika: టాలీవుడ్ లో చంద్రముఖి గురించి మాట్లాడితే.. వెంటనే జ్యోతిక గుర్తొస్తుంది. ఆ కళ్లు, ఆ డ్యాన్స్, నటన.. అప్పట్లో అభిమానులను తన నటనతోనే భయపెట్టేసింది అంటే అతిశయోక్తి కాదు. జ్యోతికను చూసిన కళ్లతో మిగతావారెవ్వరు మరో హీరోయిన్ ను ఆ క్యారెక్టర్ లో ఉహించుకోలేరు. అలానే నాగవల్లి చిత్రంలో అనుష్క చంద్రముఖిలా కనిపించినా అభిమానులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. చాలా ఏళ్ళ తరువాత డైరెక్టర్ పి. వాసు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటిస్తోంది. చంద్రముఖి 2 పేరుతో వస్తున్న ఈ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కంగనాను చంద్రముఖిగా చూసినవారందరు.. జ్యోతికను మరిపిస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే జ్యోతిక.. కంగనాపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది.
Jabardasth: లేడీ గెటప్స్.. ఒరిజినల్ ముఖాలను ఎప్పుడైనా చూశారా.. ఇదుగో చూడండి
Also Read
” మోస్ట్ టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరైన కంగనా రనౌత్.. చంద్రముఖి పాత్రను పోషించినందుకు చాలా గర్వపడుతున్నా.. ఆ పాత్రలో ఎంతో అందంగా.. అద్భుతంగా కనిపిస్తున్నారు. మీ నటనకు నేను పెద్ద ఫ్యాన్ ను. ఈ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. మీ కోసమే నేను ఈ సినిమాను చూడాలనుకుంటున్నాను. లారెన్స్, పి వాసుకు మరో హిట్ ఖాతాలో పడినట్టే.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.. ఆల్ ది బెస్ట్” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఒక చంద్రముఖి.. ఇంకో చంద్రముఖిని మెచ్చిన వేళ.. అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో కంగనా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!