NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : ప్రతిపక్షాల ఆరోపణలు టీ కప్పులో తుఫాన్ లాంటివే.. సర్పంచ్ ఎన్నికలు అప్పుడే..!

Ponguleti

Ponguleti

Ponguleti Srinivas Reddy : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌ చాట్‌ మాట్లాడుతూ.. ఈనెల నవంబర్ 6, 7 నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం గ్రామ సభలు నిర్వహిస్తామని, రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిధుల కోసం ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తుందని, మొదట పేదవారికి ప్రాధాన్యత… ఇండ్ల స్థలం ఉండి ఉన్న వారికి 5 లక్షల నిర్మాణ ఆర్థిక సహాయం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఇండ్ల స్థలాలు లేని నిరు పేదలకు 75 నుంచి 80 గజాల స్థలం ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన చేస్తోందని, 4000 sft కి తక్కువ కాకుండా ఇండ్ల నిర్మాణం చేయాల్సిందేనన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకు వస్తుందని, 360 డిగ్రీల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పని సరి అని ఆయన సూచించారు. త్వరలో రేషన్ కార్డుల స్థానాల్లో స్మార్ట్ కార్డ్ ఇస్తామని, నాలుగు దఫాలుగా ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామన్నారు మంత్రి పొంగులేటి.

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డితో వైస్ ఛాన్సలర్ల భేటీ.. దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి.

ప్రభుత్వంలోని 16 శాఖలకు సంబంధించిన ఉద్యోగులను ఇందిరమ్మ ఇండ్ల మానిటరింగ్ కు కేటాయిస్తామని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వాళ్ళు పెట్టె అన్ని షరతులకు మేము ఒప్పుకుంటామన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లను కూడా మేమే పూర్తి చేస్తామన్నారు. మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకు వెళ్ళేది ఇందిరమ్మ ఇండ్ల పథకమే అని, డిసెంబర్ లేదా సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ఆయన అన్నారు. రాబోయే నాలుగేళ్ల ఒక నెల కూడా మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే కొనసాగుతారని, ఆ తర్వాత ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు అనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ఆరోపణలు చేస్తున్నాయని, ప్రతిపక్షాల ఆరోపణలు టీ కప్పులో తుఫాన్ లాంటివే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

Rajnath Singh: భద్రతా లోపం లేదు.. వరుస ఉగ్రదాడులపై స్పందించిన రక్షణ మంత్రి..