Ponguleti Srinivas Reddy : 20 లక్షల ఇండ్లు మంజూరు చేయండి..
- జనాభాకు అనుగుణంగా తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వండి
- కేంద్ర పట్టణాభివృద్ది, హౌసింగ్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు మంత్రి పొంగులేటి వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా గడచిన పది సంవత్సరాలలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగారు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంత్రి పొంగు లేటి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు కలిసి కరీంనగర్ వెళ్లారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో కూడా మంత్రి పొంగు లేటి హౌసింగ్ కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు.
Bengaluru: బంగ్లాదేశ్ మహిళ హత్యాచారం.. కాలువలో మృతదేహం
Also Read
- RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
- Abhijeet Dipke: ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు
- Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
”గత ప్రభుత్వం గృహనిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హౌసింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేసింది. ఉద్యోగులను ఇతర శాఖలలో సర్ధుబాటు చేసింది. ఈ పరిస్ధితులలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన మా ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి, అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
సర్వే ప్రకారం రాష్ట్రంలో అర్హత పొందిన ఇల్లు లేని వ్యక్తులు సుమారు 44 లక్షల వరకు ఉన్నారు. లబ్దిదారుల అర్హత, జియో ట్యాగింగ్, వారి ప్రస్తుత నివాసం వంటి విషయాలను డాక్యుమెంటేషన్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించాం. దీనితో ఇంటింటి సర్వే నిర్వహించాం. 360 డిగ్రీ టూల్‌తో డెస్క్ వెరిఫికేషన్ జరిగింది. తుది జాబితాల రూపకల్పన కోసం గ్రామ సభలు నిర్వహించాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వేగవంతమైన పట్టణీకరణ జరుగుతుంది. 26 జిల్లాలలోని 6867 గ్రామాలను ఇటీవల యూడిఎ కిందికి తీసుకు రావడం జరిగింది. వీటిని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో చేర్చాలి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేజ్ -1 ప్రకారం దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇండ్లు మంజూరుకాగా తెలంగాణకు 1.58 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరయ్యాయి. ఇది మొత్తం మంజూరులో 0.79 శాతం. భారత దేశ పట్టణ జనాభాలో తెలంగాణ 8 శాతం కలిగి ఉంది. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రం మరో 24 లక్షల ఇండ్లను పొందడానికి అర్హత కలిగి ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పధకం (2.0) కింద కనీసం 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలి” అని మంత్రి పొంగు లేటి కోరారు.
తాజావార్తలు
-
Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
-
JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
-
Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!