ఖమ్మం సత్తుపల్లిలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం అంటే నేను పుట్టి పెరిగిన నియోజకవర్గమన్నారు. నేనేంటో చిన్న పిల్లల నుండి తొంబై ఎళ్ళ ముసలి వాళ్ళకి కూడా తెలుసు అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేక మంది పొరాటాల వలనే 60 సంవత్సరాల కల తెలంగాణ సాధన ఈ రోజు కలగానే ఉంది…? శ్రీనన్న కోసం ఇంత మంది అబిమానులు తరలివచ్చారు..కన్నులు ఉండి చూడలేక పోతున్నారా.. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమే….ఇప్పటికే ఐదు లక్షలకోట్లు అప్పు చేసింది నిజమా కాదా….అని ప్రశ్నిస్తున్న. బంగారు తెలంగాణ ను చేశారో లేదో కాని అడ్డ బిడ్డ ఉసురు మాత్రం తీసుకుంటున్నారు. మ్యానిపెస్టిలో రైతులకు రుణమాఫి చేస్తా అన్నారు ఎమైంది….? ఒకచోటో నాలుగు చోట్ల డబల్ బెడు రూం ఇళ్ళు కట్టించి ఎనిమిది ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పటి వరకు అడబిడ్డల కోసం ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారు…?
Also Read : Stray Dogs: దేశ రాజధానిలో విషాదం.. వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం
స్వంత ప్లేస్ లో ఇళ్లూ కట్టుకొవాటాని మొదట ఐదు లక్షల తరువాత మూడు లక్షలు అని మాయ మాటలు చేప్తున్నాడు కేసిఆర్. మాయ మాటల్లో సిద్దహస్తుడు ఈ కేసిఆర్ ని నమ్మోచ్చా… హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చాడు..అయిన అక్కడ చిత్తు చిత్తుగా ఓడించారు. ప్రతి నియోజకవర్గానికి 1100 దళిత బందు ప్రకటించారు…ఇది ఆచరణకు సాద్యం అవుతుందా…? చెప్పే స్కీంలు అన్ని ఎన్నికల కోసమే. మాటల దిట్ట…కేసిఆర్. కేసిఆర్ ని టైం అయిపొయింది…ఇప్పటికి రెండు సార్లు ని మాయ మాటలు విని రెండు సార్లు ముఖ్యమంత్రి ని చేశారు..ఇంకా నీమాయ మాటలు వినే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మిమ్మల్ని ఇంటికి పంపించాటానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు. అధికారం ఉందని అహకారంతో డబుల్ బెడు రూం ఇళ్ళకోసం స్థానికంగా దర్న చేస్తున్న మహిళలను ఇబ్బంది కి గురి చేస్తున్నారు.
Also Read : Tarun Chugh : కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు
అధికారం మీ అయ్య సోత్తు కాదు శాస్వతం కాదు తప్పకుండా ప్రజల బుద్ది చెబుతారు. జెండా ఎదైనా పార్టీ ఎదైనా శ్రీనన్న నిలబెట్టిన అభ్యర్థి ఎవరైన గెలిపించాలి అని అభ్యర్దిస్తున్న. యువత కన్న కలలు కల లాగే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక నోటిఫేకేషన్లు ఇచ్చారు..కానీ ఒక ఉద్యోగం ఇవ్వలేదు.. నిరుద్యోగ బృతి అన్నాడు ఒక్కరికైనా ఇచ్చారా.. ఉద్యోగస్తులకు జీతం ఇవ్వాలనే దౌర్భగ్య స్థితికి తీసుకొచ్చాడు కేసీఆర్. ఆచారణ సాధ్యం అయ్యే మాటాలు మాత్రమే చెప్పండి మాయ మాటలు చెప్పకండి’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.