Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : కేటీఆర్ కి పొంగులేటి సవాల్.. బావా బామ్మర్దుల మధ్య విభేదాలు అందరికి తెలుసు

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

బీఆర్ఎస్ లో ఉన్న బావా బామ్మర్దుల మధ్య ఉన్న అనుబంధం ఏంటో వారి మధ్య ఉన్న విభేదాలు ఇంటిలో వారు ఎప్పుడూ ఎక్కడా వెన్నుపోట్లు పడుకుంటారో ప్రజలందరికీ తెలుసు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నువ్వు నీ పింక్ కలర్ పేపర్లు నీ పింక్ కలర్ యూట్యూబ్ ర్లు నామీద దుష్పప్రచారం చేస్తున్నారు .నేను సవాల్ చేస్తున్నాను నేను ఎఫ్ తో ఎల్ లో ఇల్లు కట్టుకున్నానని చేస్తున్న ఆరోపణలు నిరూపించు.. బావా బామ్మర్దులు ఇద్దరు టేపు పట్టుకొని వచ్చి నిరూపించండి సవాల్ చేస్తున్నా అంటూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు… సృజన్ రెడ్డి అనే కాంట్రాక్టర్ నామీద పోటీ చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డి సొంత అల్లుడని ఆయనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదిగా చిత్రీకరించడం కోసం బిఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సృజన్ రెడ్డికి గత ప్రభుత్వంలో మీరు కాంటాక్ట్ పనులు ఇచ్చింది నిజం కాదా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మీరు చేసిన విమర్శలకి చాలెంజ్ చేస్తే ఆ చాలెంజ్ లకి సవాల్ కి కేటీఆర్ సిద్ధం కాలేక పోయారు.

Hyderabad Traffic : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి కసరత్తు

రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన కొద్ది పాటి ఓట్లు కూడా మీకు రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దించడానికి శ్రీనివాసరెడ్డి పొందిన పన్నాగామంట.. నీ బుర్ర ఎక్కడ ఉండాల్సిందో.. ఎక్కడుందో ప్రజలు గమనిస్తున్నారు అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.. బావా బామ్మర్దుల మధ్య ఉన్న గ్యాప్ ఏందో ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది.. మి మధ్య ఉన్న ఐక్యత ఏమిటో మీ పార్టీ నాయకులకు తెలుసు.. ఎవరు ఎప్పుడు ఎలా వెన్నుపోటు పొడిచుకుంటారో ప్రజలందరికీ తెలుసు.. చూస్తూనే వున్నారు. మా ముఖ్యమంత్రిని మా మంత్రులని మీరు విమర్శించే ముందు మీ పార్టీని చక్కబెట్టుకోండి అని కేటీఆర్ కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు..

Illegal Affair: 30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ జంప్..

Exit mobile version