NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : వరంగల్‌ వాసులకు శుభవార్త.. ఇది మామూలు ముచ్చట కాదు..!

Ponguleti

Ponguleti

Ponguleti Srinivas Reddy : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి కోసం కీలక ప్రకటన చేశారు. “విజన్-2025” పేరుతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా, వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి, నగర అభివృద్ధిపై చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. “వరంగల్‌ను తెలంగాణ రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలని మా లక్ష్యం. మన నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం,” అని మంత్రి చెప్పారు.

Kasturi: క్షమించండి.. తెలుగోళ్లపై వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నా!

మౌలిక వసతుల అభివృద్ధితో పాటు, ఆధునిక టెక్నాలజీని కూడా జోడించి వరంగల్ నగరాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దనున్నట్టు ఆయన వివరించారు. మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం, నగర అభివృద్ధికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మొదటి ప్రాధాన్యతగా విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఈ ప్రకటనతో వరంగల్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Gas Cylinder Blast: అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి బూడిదైన 6 గుడిసెలు

ఇదిలా ఉంటే.. వరంగల్ ప్రజలకు మంత్రి కొండా సురేఖ తీపి కబురు అందించారు. వరంగల్ ప్రజల చిరకాలవాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్టు కల సాకారం కానుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రయాణికుల సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు అందించే దిశగా ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేసే దిశగా సీఎంతో చర్చిస్తానన్నారు మంత్రి సురేఖ. అత్యుత్తమ నగరంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. జిడబ్ల్యుఎంసి మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రత్యేక అధికారి నియమించాలని ఎంఎయుడి ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

Show comments