Kasturi: క్షమించండి.. తెలుగోళ్లపై వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నా!
- తెలుగువారిపై నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు
- ఇప్పటికే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన కస్తూరి
- తాజాగా లేఖ రిలీజ్ చేసిన కస్తూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు వారిపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసుకున్న నటి కస్తూరి మరోసారి ఒక లేఖ విడుదల చేసింది. గతంలో మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధిస్తానని అంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విషయం మరిచిపోక ముందే ఆమె ఒక లేఖ రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె ఆ లేఖలో గత రెండు రోజులుగా నాకు అనేక బెదిరింపులు, దాడులు చేస్తామనే బెదిరింపులు వచ్చాయి అని పేర్కొంది. ఆ బెదిరింపులే నా సంకల్పాన్ని మరింత పెంచాయన్న ఆమె నేను నిజమైన జాతీయవాదినని చెప్పుకొచ్చింది.
Also Read: Thandel: అనుకున్నదే చెప్పారు.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read
నేను ఎప్పుడూ కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాననీ పేర్కొన్న కస్తూరి తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉండడం నా అదృష్టమని పేర్కొంది. తెలుగు వారు నాకు పేరు, కీర్తి, ప్రేమను అందించారన్న ఆమె నేను వ్యక్తీకరించిన అభిప్రాయాలు కొందరిని మాత్రమే, అందరినీ అనలేదని చెప్పుకొచ్చింది. నా తెలుగు కుటుంబాన్ని బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదన్న ఆమె మీ మనసును బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అని పేర్కొంది. అంతే కాదు 3వ తేదిన మాట్లాడిన నా ప్రసంగంలో తెలుగుకు సంబంధించిన అన్ని మాటలను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. వచ్చిన వివాదం నేను ఆ ప్రసంగంలో లేవనెత్తిన ముఖ్యమైన అంశాల నుండి దృష్టిని మళ్లించింది అని ఆమె పేర్కొన్నారు.

తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!