తెలంగాణ ప్రజలు తెలంగాణ లో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, అభయ హస్తంలో భాగంగా ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం వారి అవసరాలు, బాధలు తెలుసుకో లేదన్నారు. ఎనిమిది రోజుల పాటు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ గ్రామానికి, వార్డుకు, అడవిలోని చెంచు గుడానికి అధికారులు వెళ్లారని, ప్రజా పాలన విజయవంతం అయ్యిందన్నారు. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులతో లోతైన చర్చ జరిగింది. కోటి ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తులు తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల దగ్గరకే పాలన తీసుకు వెళ్తామని ఆనాడే హామీ ఇచ్చామని, దేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కోటి 25 లక్షల అర్జీలు సేకరించాము. చిన్న సంఘటన కూడా లేకుండా నిర్వహించామన్నారు.
ప్రతిపక్షాల నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. 40 రోజుల్లో హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాము.ఎవరైనా కారు కూతలు కూసిన మా మాటకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్ గా ఉండనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
