ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు తుమ్మల, పొంగులేటి ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా రఘునాథ పాలెం మండల అభివృద్ధి చేశానని ఆయన తెలిపారు. తమిద్దరి ఆధ్వర్యంలో రాజకీయ అవసరాలు తీర్చడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.
Read Also: Chiranjeevi: స్క్రిప్ట్ లో ఎవరు వేలు పెట్టకపోతే.. ఈ కాంబో సూపర్ హిట్ అబ్బా.. ?
మరోవైపు పొంగులేటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో గెలిచిన సర్పంచ్ లను బీఆర్ఎస్ లో బలవంతంగా చేరిపించుకున్నారని ఆయన ఆరోపించారు. సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరించి బీఆర్ఎస్ లో చేర్పించారని ఆయన అన్నారు. సర్పంచ్ లు ఇంత కాలం భయబ్రాంతులతో బ్రతికారన్నారు. అర్ధరాత్రి కాదు పట్టపగలే చేరుతున్నారని.. బందిపోట్లు ఎవ్వరూ అనేది ఇప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ చెప్పాలని పువ్వాడ ప్రశ్నించారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ లో చేరుతారని పేర్కొన్నారు.
Read Also: Karan Singh: కమిటీ నుంచి నా పేరు తొలగించండి.. మల్లిఖార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ సీనియర్ నేత లేఖ
కాళేశ్వరం గొప్ప గురించి కేసీఆర్ చెప్పారని.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎలా దెబ్బ తిన్నదో తెలుస్తోందని పొంగులేటి విమర్శించారు. దీనికి కారకులు ఎవరూ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఏటీఎంగా కేసీఆర్ కు ఉపయోగపడిందని అన్నారు. కాళేశ్వరం పై మొదటి నుంచి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిజం అయ్యాయని.. సీవీసీ చేత విచారణ జరపాలని కోరారు. కేసీఆర్ కు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.