NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టిస్తాం

Ponguleti On Kcr

Ponguleti On Kcr

కాంగ్రెస్‌ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆటో యూనియన్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే.. యుద్ధనౌక గద్దర్ కు మౌనం వహించారు ఆటో యూనియన్ నాయకులు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు నెలల్లో అధికార పార్టీ మిమ్మల్ని ఏమి చేయలేరని నన్ను నమ్మి ధైర్యంగా ఐఎన్టీయూసీలో చేరేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన వారిని, రావాల్సిన వారిని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు పొంగులేటి. ఆటో కార్మికుడికి ఓ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నానని, మీ లైసెన్స్ వగైరా కు ఖర్చు మొత్తం నేనే భరిస్తానని ఆయన అన్నారు. నా కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తానని ఆయన తెలిపారు. మీ ఇన్సూరెన్స్ నేనే భరిస్తానని, రేపటినుంచే లీగల్ సెల్ పని చేస్తోందని ఆయన తెలిపారు. మీ దీవెనలతో అధికారంలోకి రాబోతున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read : Sherlyn Chopra: రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా.. శృంగార తార సంచలన వ్యాఖ్యలు

అంతేకాకుండా.. ‘నిన్న అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ భిక్షతో వచ్చినా తెలంగాణ లో అధికారాన్ని అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పొగరుతో మాట్లాడారు….ఆయన తీరును ఖండిస్తున్న…. మీ దొంగ దీక్షతో తెలంగాణ రాలేదు…. సోనియా గాంధీ ఇస్తే వచ్చింది తెలంగాణ… అమరవీలవల్ల వచ్చింది తెలంగాణ…. ఎన్నికలు వస్తున్నాయి కదా సెంటిమెంటు ముందుకు తెస్తూన్నారు… ఆనాడు ఆర్టీసీ కార్మికులను అవహేళన చేయలేదా…. కార్మికుల ప్రాణాలు పోలేదా…. ఇన్నాళ్లు ఆర్టీసీ కార్మికులపైన రాణి ప్రేమ ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది… సార్వత్రిక ఎన్నికలున్నాయని డ్రామా ఆడుతున్నారు…. రుణమాఫీ ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు…. రాబోయే ఎన్నికల్లో నిన్ను ఫార్మ్ హౌస్ కు పంపితున్నారు కనుక ఇప్పటికిప్పుడు దొంగ ప్రేమ వలకబోస్తూన్నారు…. 9 ఏళ్లలో ఇల్లు కట్టని వారు 3 నెలల్లో కట్టిస్తాం అంటున్నారు.. ఇది నమ్మశక్యమా.. పోయినా ఎన్నికల్లో ఇంటికి 5 లక్షలు.. ఇప్పటి ఎన్నికలకు 3 లక్షలు… రేట్లు పెరిగాయా తగ్గయా కేసీఆర్…. అసెంబ్లీ సాక్షిగా మా భట్టిగారిని అవహేళన చేశారు…. మీకు బుద్ధి చెప్పే సమయం దగ్గలోనే ఉంది ముఖ్యమంత్రి గారు…. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గద్దెనెక్కడం ఖాయం…. అధికారపార్టీ ఆటో యూనియన్ నాయకులు అధికారమాదంతో ప్రవర్తిస్తున్నారు…. మీ జమానా హోగాయా… హమారా జమానా ఆగయా…. రావాల్సిన వారు చాలామంది ఉన్నారు…’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.

Also Read : TTD: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం