తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మాటల యుద్ధం, సవాళ్ళు ప్రతిసవాళ్లు సాగుతున్నాయి. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జ్యోతుల కుటుంబాలు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం నడుస్తోంది. తాజాగా జ్యోతుల నవీన్ టీ డీ పీ లోకి వెళ్లి అవినీతి అక్రమాలు చేశారని గతంలో విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తన జడ్పీ చైర్మన్ పదవి కోసం తండ్రి రాజకీయ జీవితాన్ని సమాధి చేశాడని విమర్శలు చేశారాయన. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ ఆరోపణలు నిరూపిస్తే జిల్లా వదిలి వెళ్ళిపోతానని జ్యోతుల నవీన్ సవాల్ విసిరారు.
Read Also:Nurse Assaulted By Gang: దారుణం.. ఆరోగ్యం కేంద్రంలో నర్సుపై సామూహిక అత్యాచారం
ఎమ్మెల్యే ద్వారంపూడిలాగా తాను అక్రమాలకు పాల్పడితే వేలాది కోట్లు ఆస్తులను కూడబెట్టేవాడినని తనకు అటువంటి దుష్ట ఆలోచన లేదని ఫైర్ అయ్యారు నవీన్. చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేస్తే ఆయనపై తాను పోటీ చేస్తానని సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్రంగా స్పందించారు. ప్రతి బచ్చాగాడి కోసం తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ప్రకటించారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే టీ డీ పీ టికెట్ తెచ్చుకోవాలని కౌంటర్ ఇచ్చారు ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇద్దరు నేతల సవాళ్ళతో కాకినాడ తీరం వేడెక్కింది. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
Read Also:MLC Kavitha : నేత వృత్తి వ్యాపారం కాదు.. దేశ వారసత్వ కళాసంపద