Police Phone Recovery: తెలంగాణ రైల్వే స్టేషన్ లో పోగట్టుకున్న లేదా దొంగలించబడిన ఫోన్స్ కొన్నిటిని రికవరీ చేసారు రైల్వే పోలీసులు. ఈ నేపథ్యంలో 21 లక్షల విలువ చేసే 210 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు ఐపిఎస్ చందన దీప్తి ఫోన్స్ అందచేశారు. ఇక ఈ విషయం పై రైల్వే ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ.. రైల్వే పోలీస్ స్టేషన్ నుండి ఇప్పటివరకు 713 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ కి ఇచ్చామని.. 2 నెలల వ్యవధిలో 210 మొబైల్స్ చోరీ కి పాల్పడిన రికవరీ చేసామని.. యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ ,తెలంగాణ, ఆంద్రప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రలలో జరిగిన చోరీలలో, అలాగే చైన్ స్నాచింగ్ ఇంకా పోగొట్టుకున్న మొబైల్స్ ను రికవరీ చేసామని తెలిపారు.
Janasena MP Balashowry: ఏపీ ప్రజల రాజధాని కల నెరవేరబోతోంది.. ఈ విజయంలో పవన్‌దే కీలక పాత్ర!
అప్డేట్ ఫీచర్స్ తో వచ్చిన న్యూ మొబైల్స్ తో సహా పెద్ద కంపెనీల మొబైళ్లను చోరీ చేస్తున్నారు. మొబైల్ పోయిన వెంటనే మీ సేవలో అప్లై చేసుకోవాలి. CEIR లో పోర్టల్ లో ఫిర్యాదు చెయ్యాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. 25 మంది మొబైల్ పోయాయని పోలీస్ స్టేషన్ లో కంప్లైన్ట్ చేశారని ఆవిడ తెలిపారు. ప్రస్తుతం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.. నిందితులను త్వరలో పట్టుకుంటామని.. IMEI నంబర్స్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేసామని వారు తెలిపారు.
IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?