హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో.. రేపు కరీంనగర్ కోర్టుకు వెళ్ళాలని.. 17న విచారణకు హాజరవుతాన్న కౌశిక్ రెడ్డి పోలీసులకు సమాధానం ఇచ్చారు. కాగా.. బంజారాహిల్స్ ఇన్పెక్టర్ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై బంజారాహిల్స్ ఠాణాలోనే ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్‌ను దర్యాప్తు అధికారిగా నియమించారు అధికారులు.
Read Also: Ukraine War: ‘‘మాకు సాయం చేయండి’’.. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న కేరళ వాసి..
ఇదిలా ఉంటే.. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్రవాగ్వాదం చేసుకొని సమావేశం రసాభాసగా మారింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. ఈ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.
Read Also: Income Tax: కూల్ డ్రింక్స్ వ్యాపారికి కోటి రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్.. షాపు చూసి అవాక్కైన అధికారులు!