Police Dog: తెలివితేటల్లో జంతువులు వేటికవే అని చెప్పాలి. ఆయా సందర్భాల్ని బట్టి వాటి తెలివిని ఉపయోగిస్తాయి. అలా మనిషితో స్నేహంగా, సొంత మనిషికంటే ఎక్కువగా ఉండే కుక్కలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. కుక్కలకు విశ్వాసమే కాదు తెలివితేటలు కూడా ఉంటాయని ఎన్నో సందర్భాల్లో తెలిసింది. పోలీసు కుక్కుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఓ పోలీసు కుక్క శునకాల్లో హీరోగా ఎదిగింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ హత్యకేసును 48 గంటల్లో ఛేదించడంలో జానీ అనే పోలీసు కుక్క సాయపడింది. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారు. దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిందితులను పట్టుకోవడంలో ఈ కుక్క సాయం చేసి పోలీసు కుక్కల మధ్య హీరోగా మారింది.
15 ఏళ్ల బాలుడు దుర్వేష్ కుమార్‌ను హత్య చేసి, అతని మృతదేహాన్ని పశ్చిమ యూపీలోని కాస్‌గంజ్‌లోని పొలంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి ట్రాక్టర్, కొంత డబ్బును కూడా దుండగులు దోచుకెళ్లారు. 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిందితులను చేరుకోవడమే కాకుండా అక్కడ ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కూడా ఆ కుక్క కనిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులు ట్వీట్ చేశారు.
Rishi-Sunak: రిషి సునాక్ ప్రధాని అవుతారా.. బ్రిటన్లో జోరుగా బెట్టింగ్
హత్య కేసులో ఆకాశ్ చౌహాన్, ధీరేంద్ర, రాహుల్ చౌహాన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీస్ శునకం హ్యాండ్లర్లు రాంప్రకాష్ సింగ్, అనురాగ్‌లను సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. జానీ అనే కుక్క చాలా సహాయం చేసింది, దాని సాయంతో ఈ కేసును 36-48 గంటల్లో ఛేదించగలిగామని కాస్‌గంజ్ ఎస్పీ బీబీజీటీఎస్ మూర్తి అన్నారు. కుక్కకు సెల్యూట్ చేసిన ఎస్పీ.. ఈ కేసులో పోలీసులు సాధించిన విజయానికి కుక్క ప్రయత్నాలే కారణమన్నారు.
https://twitter.com/Uppolice/status/1581615807125393412