ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLPRB) రాష్ట్రవ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలలో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తోంది. పరీక్షకు మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్ష కేంద్రాలు వద్ద పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆఖరు నిమిషంలో పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు పరుగులు తీశారు. అయితే.. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అయితే.. మొత్తం 5.03 లక్షల మంది అభ్యర్థులు 6,100 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Also Read : Keslapur Nagoba Jatara: నాగోబా జాతరకు బయలుదేరిన అర్జున్ ముండా, బండి సంజయ్..
వారిలో 13,961 మంది పోస్ట్-గ్రాడ్యుయేషన్, 1,55,537 మంది గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్నారు. అలాగే, 10 మంది అభ్యర్థులు పీహెచ్‌డీలు కలిగి ఉన్నారు. పోస్టుకు అవసరమైన విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా తత్సమానం. ఏపీఎస్‌ఆర్టీసీ పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ట్రాఫిక్ జామ్‌లు లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష తర్వాత, అభ్యర్థులు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (MST), ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
Also Read : Women IAS: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్.. కారణం ఇదీ..